Allu Arjun: అల్లు అర్జున్ను గట్టిగా హగ్ చేసుకున్న సుకుమార్.. బన్నీకి అభినందనల వెల్లువ
Best Actor Allu Arjun: జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచిన అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. డైరెక్టర్ సుకుమార్ బన్నీని గట్టిగా కౌగిలించుకుని శుభాకాంక్షలు చెప్పారు. నిర్మాత అల్లు అరవింద్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
Best Actor Allu Arjun: ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు పొందిన తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మూవీతో బన్నీ నటనకు జాతీయ అవార్డు వరించింది. దీంతో అల్లు అర్జున్‌కు సినీ, రాజకీయ సెలబ్రిటీలు అభినందనలు తెలుపుతున్నారు. బన్నీ అవార్డు ప్రకటన రాగానే.. సుకుమార్ సంతోషంతో ఉప్పొంగిపోయారు. అల్లు అర్జున్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. కాసేపు కంగ్రాట్స్ బన్నీ అంటూ గట్టిగా హగ్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను పుష్ప మూవీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది.
అల్లు అర్జున్ కెరీర్‌లో సుకుమార్‌దే కీరోల్ అని చెప్పొచ్చు. ఇదే విషయాన్ని అల్లు అర్జున్ కూడా 'పుష్ప' థ్యాంక్యూ మీట్‌లో చెప్పాడు. సుకుమార్ గురించి చెబుతూ బన్నీ కంటతడి పెట్టుకున్న విషయం తెలిసిందే. 'నా కెరీర్లో ఎదగడానికి కారణం సుకుమార్. నేను నా లైఫ్‌లో తల్లిదండ్రులు, తాతయ్య, చిరంజీవి గారి తర్వాత సుకుమార్‌కు రుణపడి ఉంటాను' అంటూ బన్నీ భావోద్వేగానికి గురయ్యాడు.
తన కుమారుడికి జాతీయ అవార్డు రావడంతో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆనందంలో మునిగి తేలిపోయారు. అల్లు అర్జున్, సుకుమార్‌తో కలిస సంబరాలు చేసుకున్నారు. 69 ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీకి రాని గొప్ప అవార్డును అల్లు అర్జున్ సాధించారని అన్నారు. అందుకు ప్రధాన కారణం తెలుగు ప్రేక్షకులేనని చెప్పారు. 'ఈ సినిమా తీసిన డైరెక్టర్, నిర్మాతలు, మా ఫ్యామిలీ కీర్తిని పతాకస్థాయికి తీసుకెళ్లిన మా అబ్బాయికి కృతజ్ఞతలు' అని ఆయన వివరించారు.
'నా ప్రియమైన బన్నీకి హృదయపూర్వక శుభాకాంక్షలు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. తెలుగు సినిమాకే ఈ ఘనత గర్వకారణం. అలాగే కొండపొలం, ఉప్పెన, RRR సినిమాలకు అవార్డులు అందుకున్న వారందరికీ కంగ్రాట్స్' అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. 'పుష్ప.. తగ్గేదేలే. కంగ్రాట్స్ బన్నీ' అని దర్శకధీరుడు రాజమౌళి ట్వీట్‌లో పేర్కొన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. 'కంగ్రాట్స్ అల్లు అర్జున్ బావ. పుష్ప సినిమాకు గాను మీరు పొందే అన్ని విజయాలు, అవార్డులకు అర్హులు' అని ట్వీట్ చేశారు. దీంతోపాటు ఉప్పెన టీమ్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీకి, లిరిసిస్ట్ చంద్రబోసుకు ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు.
Also Read: Samantha Ruth Prabhu: ఛాన్స్ వస్తే ఒంటరిగా బతికేయండి.. సమంత పోస్ట్ అర్థం అదేనా..?
Also Read: 69th National Film Awards 2023 Winners: అల్లు అర్జున్, RRR, ఉప్పెన, చంద్రబోస్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook