69th National Film Awards 2023 Winners: అల్లు అర్జున్, RRR, ఉప్పెన, చంద్రబోస్.. మళ్లీ తెలుగు వాళ్లదే హవా

69th National Film Awards 2023 Winners List: 2021 లో వెలువడిన చిత్రాలకు సంబంధించి 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు కైవసం చేసుకున్న విజేతల వివరాలను కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో కేంద్రం ప్రకటించింది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలోనూ వివిధ కేటగిరిలలో తెలుగు చిత్రాలు, సాంకేతిక నిపుణుల హవా కొనసాగింది.   

Written by - Pavan | Last Updated : Aug 24, 2023, 07:30 PM IST
69th National Film Awards 2023 Winners: అల్లు అర్జున్, RRR, ఉప్పెన, చంద్రబోస్.. మళ్లీ తెలుగు వాళ్లదే హవా

69th National Film Awards 2023 Winners List: 2021 లో వెలువడిన చిత్రాలకు సంబంధించి 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు కైవసం చేసుకున్న విజేతల వివరాలను కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో కేంద్రం ప్రకటించింది. దేశం నలుమూలా అన్ని భాషల్లో నిర్మించిన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, ఆయా చిత్రాలకు పనిచేసిన వివిధ సాంకేతిక నిపుణుల పేర్లను ఎంపిక చేస్తూ కేంద్రం ఈ జాబితాను విడుదల చేసింది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలోనూ వివిధ కేటగిరిలలో తెలుగు చిత్రాలు, సాంకేతిక నిపుణుల హవా కొనసాగింది. 

తెలుగు చిత్రాలు, తెలుగు సినీ ప్రముఖుల విషయానికొస్తే.. ఉత్తమ నటుడిగా పుష్ప మూవీకిగాను అల్లు అర్జున్ ఏకంగా ఉత్తమ నటుడు అవార్డ్ గెలుచుకోగా.. అదే చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేసిన దేవి శ్రీ ప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు) అవార్డ్ కైవసం చేసుకున్నాడు. RRR మూవీకి ఉత్తమ సంగీత దర్శకత్వం ( బ్యాగ్రౌండ్ స్కోర్ ) అవార్డు అందించిన కీరవాణి, RRR మూవీకి పాటపాడిన కాల భైరవ ఉత్తమ నేపథ్య గాయకుడు అవార్డు గెలుచుకోగా, ఇదే ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ని ఉత్తమ కొరియోగ్రఫీ అవార్డు వరించింది. అలాగే కొండ పొలం మూవీలో దమ్ ఢాం ఢాం పాటకు బెస్ట్ లిరిక్స్ అందించిన చంద్రబోస్ నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు స్పెషల్ ఎఫెక్ట్స్ అందించిన శ్రీనివాస్ మోహన్ కు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు, ఇదే RRR సినిమాకు గాను ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ అవార్డు సైతం వశమైంది.

69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలకు సంబంధించిన పూర్తి జాబితా ఇలా ఉంది…

బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ : రాకెట్రీ
ఉత్తమ హిందీ చిత్రం : సర్దార్ ఉదమ్
ఉత్తమ తెలుగు చిత్రం : ఉప్పెన
ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ ( పుష్ప మూవీ )
ఉత్తమ నటి : అలియా భట్ ( గంగూబాయి కతియావాడి మూవీ ) కృతి సనన్ ( మిమీ )
ఉత్తమ సహాయ నటుడు : పంకజ్ త్రిపాఠి ( మిమీ )
ఉత్తమ సహాయ నటి : పల్లవి జోషి ( ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ )
సంపూర్ణ వినోదం అందించిన ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: RRR
బెస్ట్ డైరెక్టర్ : నిఖిల్ మహాజన్, గోదావరి (మరాఠి చిత్రం )
జాతీయ సమైక్యతపై వెలువడిన ది కాశ్మీర్ ఫైల్స్‌ చిత్రానికి నర్గీస్ దత్ అవార్డు
ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ : భవిన్ రాబారి ( ఛెలో షో  గుజరాతి చిత్రం )
ఉత్తమ తొలి దర్శకుడిగా ఇందిరా గాంధీ అవార్డు : విష్ణు మోహన్ ( మెప్పడియాన్ మూవీ )
సామాజిక సమస్యలపై తెరకెక్కించిన ఉత్తమ చిత్రం : అనునాద్ - ది రెసొనెన్స్
పర్యావరణ పరిరక్షణపై తెరకెక్కించిన ఉత్తమ చిత్రం : ఆవాసవ్యూహం
ఉత్తమ బాలల చిత్రం : గాంధీ & కో
ఉత్తమ స్క్రీన్ ప్లే ( ఒరిజినల్ ) : నాయట్టు
ఉత్తమ స్క్రీన్ ప్లే (అడాప్టెడ్) : గంగూబాయి కతియావాడి
ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు) : దేవి శ్రీ ప్రసాద్ ( పుష్ప మూవీ )
ఉత్తమ సంగీత దర్శకత్వం ( నేపథ్య సంగీతం ) : ఎంఎం. కీరవాణి ( RRR మూవీ)
ఉత్తమ నేపథ్య గాయకుడు : కాల భైరవ ( RRR మూవీ )
ఉత్తమ కొరియోగ్రఫీ : ప్రేమ్ రక్షిత్, ఆర్ఆర్ఆర్
బెస్ట్ లిరిక్స్ : చంద్రబోస్, దమ్ ఢాం ఢాం ( కొండ పొలం మూవీ)
ఉత్తమ నేపథ్య గాయని : శ్రేయా ఘోషల్, ఇరవిన్ నిజల్
ఉత్తమ ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్) :
ఉత్తమ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనర్) :
ఉత్తమ ఆడియోగ్రఫీ ( చివరి మిక్స్డ్ ట్రాక్ రీ-రికార్డిస్ట్) :
ఉత్తమ సినిమాటోగ్రఫీ :
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ : వీర కపూర్ ఈ, సర్దార్ ఉదం
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: శ్రీనివాస్ మోహన్ ( RRR మూవీ )
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: డిమిత్రి మలిచ్ మాన్సీ ధ్రువ్ మెహతా, సర్దార్ ఉదమ్
ఉత్తమ ఎడిటింగ్ : సంజయ్ లీలా భన్సాలీ ( గంగూబాయి కతియావాడి మూవీ )
బెస్ట్ మేకప్ : ప్రీతీషీల్ సింగ్ ( గంగూబాయి కతియావాడి మూవీ )
ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ : RRR మూవీ
స్పెషల్ జ్యూరీ అవార్డు : షేర్షా, విష్ణువర్ధన్
ఉత్తమ కన్నడ చిత్రం: 777 చార్లీ
ఉత్తమ మలయాళ చిత్రం: హోమ్
ఉత్తమ గుజరాతీ చిత్రం: ఛెలో షో
ఉత్తమ తమిళ చిత్రం: కడైసి వివాహాయి
ఉత్తమ హర్యాన్వి చిత్రం:
ఉత్తమ దిమాసా చిత్రం:
ఉత్తమ తుళు చిత్రం:
ఉత్తమ మరాఠీ చిత్రం: ఏక్దా కాయ్ జలా
ఉత్తమ బెంగాలీ చిత్రం: కల్‌కోఖో
ఉత్తమ అస్సామీ చిత్రం: అనూర్
ఉత్తమ మెయిటీలోన్ చిత్రం - ఐఖోయిగి యమ్
ఉత్తమ ఒడియా చిత్రం - ప్రతీక్ష
ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్:
ఉత్తమ బాలల చిత్రం:
పర్యావరణ పరిరక్షణ/పరిరక్షణపై ఉత్తమ చిత్రం:
సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రం:
ఉత్తమ తొలి దర్శకుడిగా ఇందిరా గాంధీ అవార్డు:
ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్:
ఉత్తమ పర్యావరణ చిత్రం:
కుటుంబ విలువలతో కూడిన ఉత్తమ చిత్రం:
ఉత్తమ షార్ట్ ఫిక్షన్ ఫిల్మ్:
ఉత్తమ పరిశోధనాత్మక చిత్రం:
ఉత్తమ ప్రచార చిత్రం:
ఉత్తమ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిల్మ్:
ఉత్తమ అన్వేషణ చిత్రం:
ఉత్తమ విద్యా చిత్రం:
సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రం:
ఉత్తమ కళలు, సాంస్కృతిక చిత్రం:
ఉత్తమ జీవిత చరిత్ర చిత్రం:
ఉత్తమ ఎథ్నోగ్రాఫిక్ ఫిల్మ్:
తొలి నాన్-ఫీచర్ ఫిల్మ్ ఉత్తమ దర్శకుడు :
ఉత్తమ దర్శకత్వం:
ఉత్తమ సినిమాటోగ్రఫీ:
ఉత్తమ ఆడియోగ్రఫీ:
ఉత్తమ కథనం వాయిస్ ఓవర్:
ఉత్తమ సంగీత దర్శకత్వం:
ఉత్తమ ఎడిటింగ్:
లొకేషన్ సౌండ్‌లో ఉత్తమమైనది:
ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్ - ఏక్ థా గావ్ (గర్హ్వాలి & హిందీ)
ఉత్తమ దర్శకుడు - స్మైల్ ప్లీజ్ (హిందీ) చిత్రానికి బకువల్ మతియాని
కుటుంబ విలువలపై ఉత్తమ చిత్రం - చాంద్ సాన్సే (హిందీ)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - బిట్టు రావత్ (పాతాల్ టీ (భోటియా)
ఉత్తమ పరిశోధనాత్మక చిత్రం – లుకింగ్ ఫర్ చలాన్ (ఇంగ్లీష్)
ఉత్తమ విద్యా చిత్రం - సిర్పిగలిన్ సిపంగల్ (తమిళం)
సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రం - మిథు ది (ఇంగ్లీష్), త్రీ టూ వన్ (మరాఠీ & హిందీ)
ఉత్తమ పర్యావరణ చిత్రాలు – మున్నం వలవు (మలయాళం)
సినిమాపై ఉత్తమ పుస్తకం: లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం: రాజీవ్ విజయకర్ రచించిన ది ఇన్‌క్రెడిబ్లీ మెలోడియస్ జర్నీ
ఉత్తమ సినీ విమర్శకుడు: పురుషోత్తమా చార్యులు
ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ (ప్రత్యేక ప్రస్తావన): సుబ్రమణ్య బందూర్
మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్:

కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ అవార్డ్స్ వేడుకలు రెండేళ్లు ఆలస్యం అవుతూ వచ్చాయి. 2020 లో విడుదలైన ఉత్తమ చిత్రాలకు సంబంధించిన 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం 2022లో జరగ్గా.. 2021 కి సంబంధించిన వేడుకలు రెండేళ్లు ఆలస్యంగా ఈ ఏడాది జరగనున్నాయి.

Trending News