83 Movie Review: భారతదేశం తొలిసారి క్రికెట్‌లో ప్రపంచకప్‌ గెలిచిన సందర్భం.. క్రికెట్‌ అభిమానులకే కాదు.. ప్రతి ఒక్క భారతీయుడు మర్చిపోని సంఘటన. అప్పటి భారత క్రికెట్‌ జట్టుపై అంచనాలు.. ఆటగాళ్ల మధ్య అనుబంధాలు, వారు చవి చూసిన అవమానాలు.. ఆట, ఆటగాళ్ల చుట్టూ అల్లుకొన్న ఎన్నో భావోద్వేగాలు.. ఇలా ప్రతి ఒక్కటి విలువైనదే. అలాంటి కథానేపథ్యంతో తెరకెక్కిన చిత్రమే '83'. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ విజయం.. ఎన్నో ఏళ్లుగా కంటున్న కలలను నిజం చేస్తుంది. ఎన్నో ప్రశ్నలకు సమాధానమవుతుంది. 1983లో భారత క్రికెట్‌ జట్టుపై ఉన్న అనుమానాలేంటో? వారి కలలేంటో? వారికి ఎదురైన ప్రశ్నలేంటో? చివరికి వెలిగిపోయిన ముఖాలేంటి? వెలవెలబోయిందెవరు?అనే విషయాలు తెలుసుకోవాలంటే.. ‘83’ చూడాల్సిందే.


కథ ఏంటంటే?


1983 క్రికెట్ ప్రపంచకప్ లో పాల్గొనేందుకు ఇండియన్ టీమ్ ఇంగ్లాండ్ బయలు దేరుతుంది. జట్టులోని ఆటగాళ్లు.. వాళ్ల బలహీనతలను ప్రేక్షకులను పరిచయం చేయడం తో కథ మొదలవుతుంది. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన. అసలైన మ్యాచుల్లో వెస్టిండిస్, జింబాబ్వే జట్లతో గెలుపు.. తర్వాత వరుసగా జట్టు ఓటమి. తాడోపేడో తేల్చుకోవాల్సిన ఆటలో కపిల్‌దేవ్‌ విజృంభణ. 


సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై గెలవడం.. జట్టు ఫైనల్‌కు చేరడం. అప్పటికే రెండు సార్లు విశ్వవిజేత అయిన వెస్టిండిస్‌ జట్టుతో తుది పోరు.. ఉత్కంఠగా సాగిన ఆ ఆటలో విజయం సాధించి.. భారత జెండాను లార్డ్స్‌ స్టేడియంలో సగర్వంగా ఎగిరేలా చేసిన క్రికెట్టు జట్టు. 1975, 1979 సంవత్సరాల్లో జరిగిన ప్రపంచకప్‌ పోటీల్లో ఒకే ఒక్క మ్యాచ్‌ గెలిచిన భారత జట్టు.. 1983లో ఏకంగా ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న సంఘటనే ఈ కథాంశం. 


ఎవరు ఎలా చేశారంటే?


సినిమాలో ఎక్కడా రణ్‌వీర్‌సింగ్‌ కనిపించలేదు. ఆహార్యం, ఆటతీరు, ఎక్స్‌ప్రెషన్స్‌లో రణ్‌వీర్‌.. కపిల్‌దేవ్‌ను అచ్చు గుద్దినట్లు దించేశాడేమో అనిపిస్తుంది. అవమానాలు, బాధలు, విజయాల్లో అతను ప్రదర్శించిన నటన ఆకట్టుకుంటుంది. ఆవేదన, ఆవేశం, నాయకత్వం లాంటి ఉద్వేగాలను సరిగ్గా ప్రదర్శించాడు. కపిల్‌కే ప్రత్యేకమైన నటరాజ్‌ షాట్‌ ఆడినప్పుడు అతనే క్రీజ్‌లో ఉన్నాడా? అనిపించిందంటే అతిశయోక్తి కాదు. 


కపిల్‌ దేవ్ భార్య రోమి భాటియా పాత్రలో తక్కువ సమయమే కనిపించిన దీపికా పదుకొణె తన పాత్రకు న్యాయం చేసింది. కృష్ణమాచారి శ్రీకాంత్‌ పాత్రలో నటించిన జీవా అందులో జీవించేశాడు. జట్టు మేనేజర్‌గా పంకజ్‌ త్రిపాఠి మరోసారి తనదైన నటనతో మెప్పించాడు. జీవా, అమ్మి విర్క్‌, జతిన్‌ సర్ణ.. ఇలా ప్రతి ఒక్కరూ తమ నటనతో అదరగొట్టేశారు.


దర్శకుడు కబీర్ ఖాన్ కథను మలిచిన తీరు.. సంభాషణలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి.  నిర్మాణ విలువలు, కెమెరా పనితనం బాగున్నాయి. జులీస్‌ పాకియమ్, ప్రీతమ్ అందించిన నేపథ్య సంగీతం సినిమాని మరోస్థాయికి తీసుకువెళ్లింది. సినిమా చూసిన ప్రేక్షకుల గుండెలు భావోద్వేగం, సంతోషంతో నిండిపోతాయి.  



 


Also Read: Shyam Singha Roy Review: 'శ్యామ్ సింగరాయ్'గా హీరో నాని మెప్పించాడా?


ALso Read: AP Theaters closed: మా వల్ల కాదు..ఏపీలో 55 థియేటర్లకు స్వచ్ఛందంగా తాళాలేసిన యజమానులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి