A thief caught while trying to rob Mahesh Babu House: ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట 2 తీవ్ర విషాద ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో ఆయన సోదరుడు రమేష్ బాబు అనారోగ్య కారణాలతో మృతి చెందగా తాజాగా ఆయన తల్లి ఇందిరా దేవి, అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. దీంతో మహేష్ కుటుంబమంతా ఇప్పుడు తీవ్ర విషాదంలో మునిగిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే మహేష్ కుటుంబానికి సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే మహేష్ బాబు ఇంట్లో దొంగతనం చేయడం కోసం ఒక దొంగ తీవ్ర ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు ఇంట్లో చోరీ చేయడం కోసం వచ్చిన ఒక దొంగ గోడ దూకి గాయాల పాలనట్లుగా తెలుస్తోంది. దీంతో మహేష్ బాబు ఇంట్లో సెక్యూరిటీ గుర్తించి వెంటనే అతని అదుపులోకి తీసుకున్నారు.


మంగళవారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 81 లో నివాసం ఉంటున్నారు. తన భార్య నమ్రత శిరోద్కర్, పిల్లలు గౌతం, సితారలతో కలిసి మహేష్ చాలా కాలం నుంచి అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే మహేష్ ఇంటికి కన్నం వేస్తే భారీగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో అతని ఇంట్లో దొంగతనం చేయడానికి సిద్ధమైన ఒక దొంగ మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో చాకచక్యంగా కరెంట్ ఫెన్సింగ్ ఉన్న ప్రహరీ దూకి లోపలికి ప్రవేశించాడు.


అనుకున్నట్టే గోడ ఎక్కి దూకాడు కానీ అది బాగా ఎత్తుగా ఉండడంతో కింద పడటంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. పెద్ద శబ్దం రావడంతో మహేష్ బాబు ఇంట్లో సెక్యూరిటీ గార్డులు శబ్దం వచ్చిన వైపు వెళ్లి చూస్తే అక్కడ ఒక వ్యక్తి గాయాలతో పడి ఉండటంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన, సంఘటన స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని విచారించి హాస్పిటల్ కి తరలించారు.


పోలీసుల విచారణలో అతని పేరు కృష్ణ అని అతని వయస్సు 30 సంవత్సరాలు అని తెలుస్తోంది. మూడు రోజుల క్రితం ఒరిస్సా నుంచి వచ్చి హైదరాబాదులోనే ఒక నర్సరీ వద్ద ప్లాట్ఫారం మీద ఉంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దొంగతనం కోసం వచ్చిన సదరు వ్యక్తి 30 అడుగుల ఎత్తున గోడ నుంచి కిందకి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడని వెంటనే అతని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు అని తెలుస్తోంది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో మహేష్ బాబు ఇంట్లో లేరు. ఆ సమయంలో ఏఐజీ హాస్పిటల్లో మహేష్ బాబు ఉన్నారు. ఆయన తల్లికి తీవ్ర అస్వస్థత ఏర్పడడంతో మహేష్ బాబు హాస్పిటల్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక అదే రోజు తెల్లవారుజామున మహేష్ తల్లి ఇందిరాదేవి కన్నుమూసిన సంగతి తెలిసిందే.


Also Read: Anushka Shetty Marriage: 'బంగారం' లాంటి కుర్రాడితో అనుష్క పెళ్లి ఫిక్స్.. ఎవరో తెలిస్తే షాకవుతారు!


Also Read: Krishnam Raju Condolonce Meet: మొగల్తూరుకు ప్రభాస్.. కృష్ణంరాజు సంస్మరణ సభకు 50 వేల మంది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook