Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Telugu Review: సుధీర్ బాబు, మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో గతంలో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ కావడంతో వారు చేసిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాల్సిన సినిమా మీద కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాలో ప్రతి శెట్టి హీరోయిన్ గా నటించడంతో పాటు టీజర్, ట్రైలర్ సినిమా మీద మరింత ఆసక్తి పెరిగేలా చేశాయి. షూటింగ్ పూర్తయి చాలా కాలమే అయినా ఎట్టకేలకు సెప్టెంబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చేసింది. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనేది సినిమా సమీక్షలో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కథ ఏమిటంటే?
ఐదు సూపర్ హిట్ సినిమాలను వెంట వెంటనే ఇచ్చిన డైరెక్టర్ నవీన్(సుధీర్ బాబు) ఈసారి కాస్త భిన్నమైన సినిమా చేయాలని భావిస్తూ ఉంటాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాలు చేయడమే కాదు తనకంటూ పేరు తెచ్చుకునే విధంగా భిన్నమైన సబ్జెక్ట్ చేయాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్న సమయంలో రోడ్డు మీద వెళుతున్న క్రమంలో ఒక పాడైన సినిమా రీల్ దొరుకుతుంది. డిజిటల్ యుగంలో కూడా రీల్స్ వాడుతున్నారా అని అనుమానం వచ్చి ఆ రీల్ తనకు తెలిసిన ల్యాబ్లో కడిగిస్తాడు. ఆ సమయంలో ఆ రీల్ లో నటించిన అమ్మాయిని చూసి మెస్మరైజ్ అవుతాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ అలేఖ్య(కృతి శెట్టి) అని తెలుసుకుంటాడు. ఆమెను ఎలా అయినా తన సినిమాలో నటింపజేయాలని ఆమె వెనక పడుతూ ఉంటాడు. ఇలా ఆమె వెంట పడుతున్న సమయంలో అనూహ్యమైన ఒక విషయం తెలుస్తుంది. ఆ రీల్ ఉన్నది అలేఖ్య కాదని అలేఖ్య సోదరి అని తెలుస్తుంది. సినిమా నటి అవ్వాలని కోరికతో ఒక అప్ కమింగ్ దర్శకుడిని వివాహం చేసుకొని ఆ దర్శకుడు చేసే సినిమా ఆగిపోవడంతో భార్యాభర్తలు ఇద్దరూ సూసైడ్ చేసుకోవడంతో అలేఖ్య కుటుంబం అంతా సినిమా మీద అసహ్యం పెంచుకుంటారు. అలాంటి తరుణంలో అలేఖ్య నవీన్ సినిమాలో నటించిందా ? అసలు ఈ కథకు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే టైటిల్ ఎందుకు వచ్చింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 


విశ్లేషణ:
సినిమాలు, సినీ నిర్మాణం బ్యాగ్రౌండ్, హీరో దర్శకుడిగా ఉంటూ సినిమాలు చేయడం వంటి సినిమాలు గతంలోనే వచ్చాయి. వాటన్నిటికీ భిన్నంగా ఈ కథ రాసుకున్నారు మోహన్ కృష్ణ ఇంద్రగంటి. కమర్షియల్ డైరెక్టర్గా ఎదురే లేని ఒక వ్యక్తి తన శైలికి భిన్నంగా వెళ్లడానికి ప్రయత్నం చేసి అనుకోకుండా ఒక రీల్ చూసి స్ట్రక్ అవ్వడం అనే పాయింట్ ప్రేక్షకులకు కొంచెం ఎక్సైట్ చేసే విధంగా ఉంటుంది. అయితే ఫస్ట్ హాఫ్ లో పాత్రలను పరిచయం చేసిన తర్వాత కథలోకి తీసుకు వెళ్లడానికి చాలా సమయం తీసుకున్నాడు దర్శకుడు. సరిగ్గా ఇంటర్వెల్ ముందు ఒక ట్విస్ట్ తో ముగిస్తారు ఇక సెకండ్ హాఫ్ లోకి వెళ్ళాక అయినా కథలో వేగం పెరుగుతుంది అనుకుంటే అదే విధంగా కాస్త సాగదీత ధోరణితోనే ముందుకు తీసుకు వెళతారు. కథ ప్రకారం చూసుకుంటే లైన్ ఆసక్తికరంగానే ఉన్నా దాన్ని ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విషయంలో మాత్రం దర్శకుడు పూర్తిస్థాయిలో సఫలం కాలేదని చెప్పాలి. దర్శకుడిగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా ఆయన మార్క్ లేదనిపిస్తుంది. అదీకాక మోహన్ కృష్ణ-సుధీర్ బాబు కాంబో అనగానే ఏర్పడిన అంచనాలు ఈ సినిమా విషయంలో ఇబ్బంది కరంగా మారిందని  చెప్పక తప్పదు. 


నటీనటుల విషయానికి వస్తే
ఈ సినిమాలో సుధీర్ బాబు ఎప్పటిలాగే తనదైన శైలిలో నటించారు. ఒకరకంగా సినిమా మొత్తం మీద కృతి శెట్టితో డామినేట్ చేసి నటించగల రోల్ ఆయనకు దక్కింది. కృతి శెట్టి కూడా సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలలో మెరి సింది. ఆమె రెండు పాత్రలకు న్యాయం చేసిందని చెప్పాలి. ఇక హీరో స్నేహితుడు, రచయిత పాత్రలో కనిపించిన రాహుల్ రామకృష్ణ కూడా చాలాకాలం తర్వాత ఒక సెటిల్డ్ రోల్ పర్ఫార్మ్ చేశారు. ఇక ఎప్పటిలాగే వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో సినిమాని కొత్త ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక అలేఖ్య తండ్రి పాత్రలో నటించిన శ్రీకాంత్ అయ్యంగార్ నటన సినిమాకు బాగా ప్లస్ అవుతుంది. ఇక మిగిలిన వారు తమ పాత్రల పరిధి మీద నటించి ఆకట్టుకున్నారు.


టెక్నికల్ టీం
టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాకు మోహన్ కృష్ణ ఇంద్రగంటి రచించి దర్శకత్వం వహించారు.  కథగా అనుకున్నప్పుడు బాగానే ఉన్నా సరే దాని ఫైనల్ అవుట్ పుట్ విషయంలో మాత్రం కాస్త తడబడినట్లే కనిపిస్తోంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి తన మార్క్ అందుకోలేకపోయారు అని చెప్పాలి. ఇక సంగీతం విషయంలో వివేక్ సాగర్ కొన్ని పాటలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది ఇక మార్తాండ్ కె వెంకటేష్, సెకండ్ హాఫ్ లో తన కత్తెరకు పని చెప్పాల్సింది. పీజీ విందా కెమెరా పనితనం చాలా సీన్స్ లో కనిపించింది. మైత్రి మూవీ మేకర్స్ బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ల మీద సమంత మేనేజర్ మహేంద్ర బాబు, కిరణ్ ఈ సినిమాని నిర్మించారు. ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే మైత్రి మూవీ మేకర్స్ బ్రాండ్ కు ఏ మాత్రం తగ్గకుండానే సినిమా ఉంది.


ఓవరాల్ గా చెప్పాలంటే
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనేది ఒక ఎమోషనల్  డ్రామా. కథా-కథనాల విషయం పక్కన పెడితే ఫ్యామిలీతో కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడగలిగే సినిమా ఇది. కాస్త రొటీన్ అనిపించి సాగతీత ఫీలైనా టైటిల్ జస్టిఫికేషన్ బాగుంటుంది.
 
Rating: 2.25/5


Also Read: Mahesh Babu Couple with Weavers: చేనేత మహిళలకు మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ చేయుత


Also Read: Nagarjuna: ఇంకా ఎందుకు మధన పడటం..సమంత-నాగ చైతన్య విడాకులపై మౌనం వీడిన నాగార్జున



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి