Nagarjuna: నాగ చైతన్య-సమంతల విడాకులు. గత ఏడాది మొత్తం మీడియాలో ఇదే హాట్ టాపిక్. ఈ వ్యవహారంపై నాగార్జున మొత్తానికి మౌనం వీడారు. నాగ చైతన్య-సమంతల విడాకులపై స్పందించారు..
టాలీవుడ్ సూపర్ గ్లామరస్ కపుల్‌గా ప్రాచుర్యం పొందిన నాగ చైతన్య-సమంంతల విడాకుల ప్రకటన గత ఏడాది అక్టోబర్‌లో జరిగింది. అంటే దాదాపు ఏడాది కావస్తోంది. సోషల్ మీడియాలో ఈ ఇద్దరూ విడాకుల ప్రకటన చేయగానే..లక్షలాదిమంది అభిమానులు నిరాశకు లోనయ్యారు.
ఈ వ్యవహారంపై నాగ చైతన్య తండ్రి, దక్షిణాది అగ్ర నటుడు నాగార్జున ఇప్పటివరకూ పెద్దగా స్పందించలేదు. తాజాగా ఈ విషయంపై మౌనం వీడారు. బ్రహ్మాస్త్ర పార్ట్ 1 విడుదల సందర్భంగా పింక్విల్లా.కామ్‌తో మాట్లాడుతూ..సమంత-నాగ చైతన్యలు విడిపోవడంపై స్పందించారు.
నాగ చైతన్య-సమంత విడాకులపై నాగార్జున ఏమన్నారంటే
అతడు ( నాగ చైతన్య ) సంతోషంగా లేడు. అదంతా నేను చూశాను. నా వరకైతే మంచిదే అయింది. అతనికి అదొక అనుభవం. దురదృష్టకరం. ఇంకా దీని గురించి మధనపడాల్సిన అవసరం లేదు. అది అయిపోయింది. అది మన చేతుల్లో లేనిది.
దక్షిణాది సినిమాలను బాలీవుడ్ రీమేక్ చేయడం మానివేయాలని నాగార్జున సూచించారు. అందరూ అన్ని సినిమాలను ఓటీటీల్లో చూస్తున్నారని చెప్పారు. అందరూ అన్నీ చూస్తున్నారు. కంపేర్ చేసుకుంటున్నారు. రీమేకింగ్ నిలిపివేయాలి. నాకైతే వ్యక్తిగతంగా రీమేక్ ఇష్టం లేదు.
సమంత-నాగ చైతన్యలు తొలిసారిగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏం మాయ చేశావే సినిమా షూటింగ్ సందర్భంగా 2010లో కలుసుకున్నారు. అప్పట్నించి ఇద్దరి మధ్య బంధం కొనసాగింది. 2017 అక్టోబర్ 6న గోవాలో పెళ్లి, అక్టోబర్ 7న క్రిస్టియన్ వెడ్డింగ్ జరిగాయి. 2021 అక్టోబర్‌లో విడిపోయారు.
Also read: Sunny Leone Bikini Pics: సాగరతీరాన బికినీలో సన్నీ లియోన్ బీభత్సం.. హాట్ అందంతో చంపేస్తుందిగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook