Aadavallu Meeku Johaarlu: శర్వానంద్ హీరోగా, రష్మికా మందన్న హీరోయిన్​గా నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా లిరికల్​ టైటిల్​ సాంగ్​ను నేడు విడుదల చేసింది చిత్ర బృందం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'హెయ్​ లక్ష్మమ్మో, పద్మమ్మో, శాంతమ్మో, శారదమ్మో, గౌరమ్మో, కృష్ణమ్మో.. నా భాదే వినవమ్మో.. ఈ గోలే ఏందమ్మో.. ఈగోలే చాలమ్మో' అంటూ ఈ సాగే ఈ సాగ్​ సరికొత్తగా ఉంది.


ఆడవాళ్లను ఉద్దేశిస్తూ.. ఓ పెళ్లికాని యువకు పాడే పాటగా దీని తెరకెక్కించారు. దేవీ శ్రీ ప్రసాద్​ ఈ సినిమాకు సంగీతమందించారు. ఈ టైటిల్​ సాంగ్​ను కూడా డీఎస్​పీనే పాడారు.


ఈ పాటను గమనిస్తే.. హీరో ప్రేమిద్దాం, పెళ్లి చేసుకుందామని చూస్తుంటే.. కొంత మంది ఆడవాళ్ల వల్ల అందుకు సమస్యలు వస్తుంటాయని అర్థమవుతుంది. మరి ఆ ప్రాబ్లమ్స్​ నుంచి తప్పించుకుని హీరోయిన్​ను ఎలా లవ్​ చేస్తాడు? అడవాళ్లకు జోహార్లు అనే టైటిల్​ వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి అనేది తెలియాలంటే సినిమా రిలీజ్​ వరకు ఆగాల్సిందే.


ఈ నెల 25న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.



'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా గురించి..


ఈ సినిమాలో శర్వానంద్, రష్మికా మందానా ప్రధాన పాత్రలో నటించారు. కుష్బు, రాధికా శరత్​కుమార్​, ఊర్వశీ, ఝాన్సీ, కళ్యాణి నటరాజన్​, రజశ్రీ నాయర్​, సత్య క్రిష్ణ, బెనర్జీ, గోపరాజు రమణలు కీలక పాత్రల్లో కనిపించారు.


సొంత కథతో తిరుమల కిశోర్ ఈ సినిమాకు​ దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినమాస్ బ్యానర్​పై సుధాకర్​ చెరుకూరి సినిమాను నిర్మించారు. ఎడిటింగ్​ శేఖర్​ ప్రసాద్​, యాక్షన్ సీన్లు పీటర్ హెయిన్స్​ తీశారు.


పేరుకు తగ్గట్లుగానే ఈ సినిమా ఎక్కువగా హీరో, మహిళల చుట్టూ తిరగనుంది. సినిమా ఫ్యామిలీ, యాక్షన్​ ఎంటర్​టైనర్​గా తెరకెక్కింది.


Also read: Neha Shetty: మేము ఏది చేసినా మీ కోసమే.. హీరోయిన్ నేహా శెట్టి పుట్టుమచ్చల వివాదంపై స్పందించిన హీరో!!


Also read: Saamanyudu : విశాల్ 'సామాన్యుడు' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook