Neha Shetty: మేము ఏది చేసినా మీ కోసమే.. హీరోయిన్ నేహా శెట్టి పుట్టుమచ్చల వివాదంపై స్పందించిన హీరో!!

Siddhu Neha Shetty: డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి పుట్టుమచ్చల వివాదంపై హీరో సిద్ధు జొన్నలగడ్డ స్పందించాడు. తన ట్విట్టర్ ఖాతాలో సుదీర్ఘ నోట్ పోస్ట్ చేసి.. నటులను గౌరవించండి అని పేర్కొన్నాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2022, 03:51 PM IST
  • పుట్టు మచ్చలెన్ని ఉన్నాయంటూ ప్రశ్నించిన జర్నలిస్టు
  • నేహా శెట్టి పుట్టుమచ్చల వివాదంపై స్పందించిన హీరో
  • మేము ఏది చేసినా మీ కోసమే
Neha Shetty: మేము ఏది చేసినా మీ కోసమే.. హీరోయిన్ నేహా శెట్టి పుట్టుమచ్చల వివాదంపై స్పందించిన హీరో!!

Siddhu reacts on Neha Shetty Moles issue: సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరోహీరోయిన్‌లుగా తెరకెక్కిన రొమాంటిక్ సినిమా 'డీజే టిల్లు'. 'అట్లుంటది మనతోని' అనేది ఉపశీర్షిక. ఈ సినిమాను విమల్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించింది. బుధవారం హైదరాబాద్‏లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. సీనియర్ జర్నలిస్ట్ హీరోయిన్ పుట్టుమచ్చల గురించి అడిగిన ప్రశ్న పెద్ద వివాదంగా మారింది. ఈ విషయంపై ఇప్పటికే హీరోయిన్‌ నేహా శెట్టి స్పందించగా.. తాజాగా హీరో సిద్ధు తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. 

డీజే టిల్లు ట్రైలర్‌లో హీరోయిన్ పుట్టుమచ్చల సంబంధించి ఓ డైలాగ్ ఉంది. 'మొత్తం ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయేంది నీకు' అని హీరో అడగ్గా.. 'పదహారు' అని హీరోయిన్ రిప్లై రిప్లై ఇస్తుంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో స్టేజ్ మీద హీరో సిద్దు మాట్లాడుతుండగా ఓ సీనియర్ జర్నలిస్టు అతి చేశాడు. 'నిజంగానే తెలుసుకున్నారా ఏందీ ఎన్ని పుట్ట మచ్చలు ఉన్నాయో అని హీరోయిన్‌కి' అని సిద్ధుని ప్రశ్నించాడు. ఆ సమయంలో హీరో ఇబ్బంది పడుతూ.. ఈ ప్రశ్నను అవాయిడ్ చేద్దాం అని రిప్లై ఇచ్చాడు. ఈరోజు మాత్రం తన ట్విట్టర్ ఖాతాలో సుదీర్ఘ నోట్ పోస్ట్ చేసి.. నటులను గౌరవించండి అని పేర్కొన్నాడు. 

'నా కొత్త సినిమా డీజే టిల్లు ట్రైలర్ లాంచ్ సందర్భంగా నన్ను అర్ధం లేని ప్రశ్న అడిగారు. రెస్పాన్స్ ఎందుకు ఇవ్వలేదని నన్ను చాలా మంది అడిగినా.. నేను సింపుల్‌గానే సమాధానం చెప్పకుండా స్కిప్ చేసే ప్రయత్నం చేశాను. నా టెంపర్కోల్పోవాలనుకోలేదు. కానీ ఇపుడు ఇండస్ట్రీలో ఉండే నటీనటులపై ఏవేవో మాటలు మాట్లాడుతున్నారని తెలిసింది. యాక్టర్స్ కొన్ని సన్నివేశాల్లో చాలా ఇబ్బంది పడుతూనే నటిస్తారు. ముఖ్యంగా ఆడవాళ్లళ్లు. షూట్ సమయంలో యూనిట్ అంతా అక్కడే ఉంటుంది. అందరి ముందు తన కో స్టార్‌ను  కిస్ చెయ్యాలి అంటే ఎంతో గుండె ధైర్యం కావాలి' అని సిద్ధు పేర్కొన్నాడు. 

'సినిమాల్లో మేము చేసే సీన్స్ ఆధారంగా మా నిజ జీవితంను జడ్జ్ చేయకూడదు. మమ్మల్ని అర్ధం చేసుకొని మా వృత్తిని గౌరవించండి. మేము ఏది చేసినా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు మాత్రమే. ఇది గుర్తుంచుకోండి. ఇదంతా పక్కన పెడితే.. నేను నా 'డీజే టిల్లు' సినిమా ప్రమోట్ చేసుకోడానికి మాత్రమే అక్కడికి వచ్చాను. ట్రైలర్ బాగుందని అనుకుంటున్నా. త్వరలోనే సినిమా విడుదల అవుతుంది. ఈ సినిమాలో అన్ని హంగులూ ఉన్నాయి, అందరికీ నచ్చుతుంది. మళ్ళీ కలుద్దాం' అని సిద్ధు జొన్నలగడ్డ ట్వీట్ చేశాడు. 

Also Read: IPL 2022 Auction: విరాట్ వైపు పరుగెత్తి.. నీకు ఏది అనిపిస్తే అది చెప్పు! చహల్‌కు సలహా ఇచ్చిన కోచ్!!

Also Read: Zuckerberg Net Worth: మార్క్ జుకర్ బర్గ్​కు ఒక్క రోజులో రూ.2.2 లక్షల కోట్ల లాస్​!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News