Aadi Keshava First Single Promo Out: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్(Vaisshnav Tej), టాలీవుడ్ సెన్షేషన్ శ్రీలీల(Sreeleela) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మూవీ 'ఆది కేశవ'(Aadi Keshava). ఈ సినిమా ద్వారా శ్రీకాంత్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.  ఈ చిత్రాన్ని సితార సంస్థతో కలిసి తివిక్రమ్‌ తన సొంత బ్యానర్ ఫ్యార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. జీవి ప్రకాష్ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసారు మేకర్స్.  సిత్తరాల సిత్తారవతి అంటూ సాగుతున్న ఈ సాంగ్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఇందులో వైష్ణవ్‌, శ్రీలీల డ్యాన్స్‌ ఇరగదీశారు. పుల్ లిరికల్ వీడియోను సెప్టెంబరు 09న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 వైష్ణవ్‌ తేజ్‌కు ఉప్పెన తర్వాత సరైన హిట్ లేదు. రంగ రంగ వైభవంగా, కొండ పొలం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ మూవీ ద్వారానే సాలిడ్ హిట్ కొట్టాలని కసితో పనిచేస్తున్నాడు వైష్ణవ్. శ్రీలీల గ్లామర్, స్టార్ డమ్ ఈ చిత్రానికి ప్లస్ కానుంది. ఈ మధ్య శ్రీలీల టేకాఫ్ చేసిన ప్రతి ప్రాజెక్టు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. టాలీవుడ్ లో అరడజనుకుపైగా సినిమాలు ఈ అమ్మడు చేతిలోనే ఉన్నాయి. మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ జోజు జార్జ్(Joju George) విలన్ గా నటిస్తున్నాడు. ఈ మూవీ స్టోరీ ఓ గుడి చుట్టు తిరగబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ మూవీపై వీర లెవల్లో అంచనాలను పెంచేశాయి. ఈ మూవీ ద్వారానైనా వైష్ణవ్ తేజ్ సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి. 



Also Read: Jawan Movie: రిలీజ్ కు ముందే 'జవాన్' జోరు.. అడ్వాన్స్ బుకింగ్స్ లో 'పఠాన్' రికార్డు బ్రేక్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook