Aamir Khan: కొడుకు కోసం తన మాజీ భార్య కిరణ్‌రావుతో మళ్లీ కలిసిన అమీర్‌ఖాన్
Aamir Khan and ex wife Kiran Rao : కొడుకు ఆజాద్ కోసం ఈ తల్లిదండ్రులు ఇద్దరూ కలిశారు. ఇక అయితే విడాకులు తీసుకున్నా కూడా తాము స్నేహితుల మాదిరిగా కలిసి ఉంటామని అమీర్‌ఖాన్, కిరణ్‌రావు గతంలో పేర్కొన్నారు. చెప్పిన విధంగానే ఈ జంట విడిపోయినా కూడా అప్పుడప్పుడు ఫ్రెండ్స్ మాదిరిగా కలుస్తున్నారు.
Aamir Khan And Kiran Rao Celebrate Son Azad's Birthday together: బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ ఆయన భార్య కిరణ్‌రావు కొన్ని రోజుల క్రితం విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ డైవర్స్ విషయం అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ వార్త విని చాలా మంది అప్పట్లో షాక్ అయ్యారు. ఇక అమీర్‌ఖాన్ రీనా దత్తాతో (Reena Dutta) కూడా విడాకులు తీసుకున్నారు.
కానీ రీనాకు, అమీర్‌కు డైవర్స్ అయ్యాక.. ఆమెతో అమీర్ కలవలేదు. కానీ కిరణ్‌రావ్ తో (Kiran Rao) విడిపోయిన కూడా అమీర్ సానిహిత్యాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా కొడుకు ఆజాద్ కోసం ఈ తల్లిదండ్రులు ఇద్దరూ కలిశారు. ఇక అయితే విడాకులు తీసుకున్నా కూడా తాము స్నేహితుల మాదిరిగా కలిసి ఉంటామని అమీర్‌ఖాన్, కిరణ్‌రావు గతంలో పేర్కొన్నారు. చెప్పిన విధంగానే ఈ జంట విడిపోయినా కూడా అప్పుడప్పుడు ఫ్రెండ్స్ మాదిరిగా కలుస్తున్నారు. అమీర్‌ఖాన్ లాల్ సింగ్ చద్దా (lal singh chaddh) మూవీకి కిరణ్‌రావు పని చేశారు. ఇక ఇప్పటికీ కిరణ్‌రావుతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు అమీర్‌ఖాన్.
Also Read : Smart TV Discount Offer: భలే మంచి చౌక బేరం.. అమెజాన్ లో రూ.6,999లకే స్మార్ట్ LED టీవీ!
రీసెంట్‌గా తమ కుమారుడు ఆజాద్ పుట్టినరోజు (Azad's Birthday) సందర్భంగా అమీర్‌ఖాన్ ఆయన మాజీ భార్య కిరణ్‌రావు కలిశారు. ఆజాద్ బర్త్‌డేను వారిద్దరూ కలిసి సెలబ్రేట్ చేశారు. ఇక సెలబ్రేషన్స్‌లో అమీర్‌ఖాన్ పెద్ద కొడుకు జునైద్‌ఖాన్, (Junaid Khan) అలాగే మొదటి భార్య రీనా దత్త పాల్గొన్నారు. సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫోటోలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే అమీర్‌ఖాన్ నెక్ట్స్ మూవీస్‌లకు కూడా కిరణ్‌రావు పని చేస్తుందని తెలుస్తోంది.
అయితే అమీర్, కిరణ్‌రావ్‌లు ఆజాద్ బర్త్‌డే (Azad's Birthday) కోసం కలిసింది నవంబర్ 25న. ఆజాద్‌కు పదేళ్లు నిండటంతో జరిగిన సెలబ్రేషన్స్‌లో ఈ జంట కలిసింది. అయితే ఈ ఫంక్షన్‌కు హాజరైన వారిలో కొందరు ఆ ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో (Social media) షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.
Also Read : Face Mask Mandatory: 'మాస్క్ లేకుండా బయటికొస్తే రూ.1000 జరిమానా': తెలంగాణ ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook