Face Mask Mandatory: 'మాస్క్​ లేకుండా బయటికొస్తే రూ.1000 జరిమానా': తెలంగాణ ప్రభుత్వం

Face Mask Mandatory: ఒమిక్రాన్ వేరియంట్ భయాలతో తెలంగాణ ప్రభుత్వం కఠిన కొవిడ్ నిబంధనలను అమలు చేస్తోంది. రాష్ట్రంలో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2021, 03:21 PM IST
  • తెలంగాణలో మాస్క్​ తప్పనిసరి
  • మాస్కు లేకుంటే రూ.1000 జరిమానా
  • అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం
Face Mask Mandatory: 'మాస్క్​ లేకుండా బయటికొస్తే రూ.1000 జరిమానా': తెలంగాణ ప్రభుత్వం

Face Mask Mandatory in Telangana from Today: దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ భయాలు కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మరోసారి కఠిన కొవిడ్ నిబంధనలను అమలు చేసేందుకు (COVID guidelines in Telangana) సిద్ధమైంది. ఇందులో భాగంగా.. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారికి మాస్క్​ తప్పనిసరి (Face Mask Mandatory in Telangana) చేసింది. ఎవరైనా మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే.. రూ.1000 వరకు జరిమానా విధించనున్నట్లు తెలిపింది.

కరోనా కట్టడికోసం ప్రతి ఒక్కరి విధిగా మాస్కు ధరించి సహకరించాలని కోరింది.

ఈ వివరాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ డీహెచ్​​ శ్రీనివాస్ (Telangana DH srinivas)​.

భారత్​లో ఒమిక్రాన్ వేరింయట్ (omicron variant in India)​ ఏ క్షణాంలోనైనా బయపడొచ్చని కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు రెండు డోసు వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలని సూచించారు.

మాస్క్​ పెట్టుకోకపోవడం, వ్యాక్సిన్ వేసుకోకపోవడం వంటి నిర్లక్ష్యాల వల్ల.. థార్ఢ్​ వేవ్​ గురింంచిన అసత్య ప్రచారాలను నిజం చేసినవాళ్లమవుతామని పేర్కొన్నారు.

వైరస్​ పూర్తిగా కనుమరుగు కాలేదని డీహెచ్​ శ్రీనివాస్ పేర్కొన్నారు. అది ఇంకా మనతోనే ఉందని తెలిపారు. మనం పెట్టుకునే మాస్క్ వ్యాక్సిన్​ కంటే పవర్​ ఫుల్ అని తెలిపారు. వ్యక్తిగత, సామాజిక బాధ్యతగా మాస్క్​ ధరించాలని కోరారు.

కరోనా మొదటి రెండు దశలు.. ఉన్నఫలంగా వచ్చాయని అయితే ఒమిక్రాన్ వేరింయట్ మాత్రం మనకు ఓ హెచ్చరిక ఇచ్చినట్లు పేర్కొన్నారు శ్రీనివాస్. భౌతిక దూరం పాటించడం, సమూహాలుగా తిరగకపోవడం వంటి వాటి ద్వారా మనను మనం రక్షించుకోవచ్చని.. థార్ఢ్​ వేవ్​ నుంచి కూడా తెలంగాణ బయటపడగలుగుతుందని వివరించారు.

Also read: Mother, Child suicide : ఎంత కష్టమొచ్చిందో.. 9 నెలల కుమార్తెను నడుముకు కట్టుకుని ఆత్మహత్య చేసుకున్న తల్లి

Also read: Road Accident: టైరు పేలి బావిలో పడిన కారు..తల్లీకుమారుడితోపాటు గజఈతగాడు దుర్మరణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News