Saana Kastam Song Promo: కొత్త ఏడాదిలో హుషారైన గీతాన్ని వినిపించనున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన కథానాయకుడిగా నటించిన 'ఆచార్య' చిత్రంలోని 'శానా కష్టం'.. అంటూ సాగే లిరికల్ సాంగ్ ను జనవరి 3న సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. ఈ నేపథ్యంలో ఆ పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"శానా కష్టం వచ్చిందే మందాకిని.. చూసే వాళ్ల కళ్లు కాకులెత్తుకుపోనీ.." అంటూ ఈ సాంగ్ స్టార్ కానుంది. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన స్టెప్పులతో అలరించారు. ఈ పాటలో ప్రముఖ హీరోయిన్ రెజీనా కసెండ్రా తళుక్కున మెరిసింది. 



ఇప్పటికే ఈ చిత్రం నుంచి రామ్ చరణ్ పోషించిన సిద్ధ పాత్రకు సంబంధించిన చిత్ర టీజర్​ను రిలీజ్​ చేసింది చిత్రబృందం. ఇందులో చరణ్​ శక్తిమంతమైన పాత్రలో ఒదిగిపోయారు. ఆయన గెటప్‌, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. దీంతో పాటు సినిమా నుంచి అంతకుముందు విడుదలైన రెండు పాటలు 'లాహే లాహే..', 'నీలాంబరి' పాటలకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. 


కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌  చరణ్‌ మరో కథానాయకుడు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు.  ఫిబ్రవరి 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.  


Also Read: Kajal Aggarwal Pregnant: గుడ్ న్యూస్ చెప్పిన గౌతమ్ కిచ్లు.. తల్లికాబోతున్న కాజల్ అగర్వాల్


Also Read: Bheemla Nayak Release: సంక్రాంతి బరిలో భీమ్లా నాయక్?.. ట్విట్టర్ లో ట్రెండింగ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి