Kajal Aggarwal Pregnant: గుడ్ న్యూస్ చెప్పిన గౌతమ్ కిచ్లు.. తల్లికాబోతున్న కాజల్ అగర్వాల్

Kajal Aggarwal Pregnant: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ దంపతులు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. కాజల్ తల్లి కాబోతున్నట్లు ఆమె భర్త గౌతమ్ కిచ్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. న్యూఇయర్ సందర్భంగా ఈ వార్తను అభిమానులతో షేర్ చేసుకున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2022, 10:23 AM IST
Kajal Aggarwal Pregnant: గుడ్ న్యూస్ చెప్పిన గౌతమ్ కిచ్లు.. తల్లికాబోతున్న కాజల్ అగర్వాల్

Kajal Aggarwal Pregnant: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుందన్న వార్తలు కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే విషయమై అటు బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లోనూ పెద్ద చర్చ జరిగింది. న్యూఇయర్ సందర్భంగా దీనికి సంబంధించిన నిజం బయటపడింది. తన భార్య తల్లి కాబోతుందని కాజల్ భర్త గౌతమ్ కిచ్లు ప్రకటించాడు. 

2022లో శుభవార్త వింటారని గౌతమ్ కిచ్లు వెల్లడించాడు. న్యూఇయర్ సందర్భంగా గౌతమ్.. కాజల్ కు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ.. క్యాప్షన్ గర్భిణీ ఎమోజీని పోస్ట్ చేశాడు. దీంతో కాజల్ గర్భం దాల్చినట్లు తెలుస్తోంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gautam Kitchlu (@kitchlug)

ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులతో పాటు కాజల్ అభిమానులు వారికి విషెస్ తెలియజేస్తున్నారు. కొంతమంది కాజల్ అభిమానులు.. తమ అభిమాన హీరోయిన్ ను జాగ్రత్తగా చూసుకోవాలని గౌతమ్ కిచ్లుకు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే లిటిల్ కాజల్ రాబోతుందంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. 

న్యూఇయర్ సందర్భంగా కాజల్ దంపతులిద్దరూ వెకేషన్ కు వెళ్లారు. ఓ క్రూయిజ్ షిప్ లో గౌతమ్, కాజల్ ఇద్దరూ కలిగి దిగిన ఫొటోను ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. 

సినిమాల విషయానికొస్తే.. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం 'ఆచార్య', 'భారతీయుడు 2', 'హే సినామిక', 'పారిస్ పారిస్' చిత్రాల్లో నటిస్తుంది. ఇప్పుడు గర్భం దాల్చిన క్రమంలో సినిమాలకు కాజల్ కొన్ని నెలలు బ్రేక్ చెప్పే అవకాశం ఉందని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది.  

Also Read: Bheemla Nayak Release: సంక్రాంతి బరిలో భీమ్లా నాయక్?.. ట్విట్టర్ లో ట్రెండింగ్

Also Read: Varshini Latest Photos: న్యూఇయర్ లో డోస్ పెంచేసిన యాంకర్ వర్షిణి.. హాట్ పిక్స్ మామూలుగా లేవుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News