Disaster Movies in Tollywood 2022 ఈ ఏడాదిలో టాలీవుడ్‌కు పెద్ద పెద్ద గుణపాఠాలు తగిలాయి. సినిమాలో కంటెంట్ ఉండాలి.. సరైన కంటెంట్ లేకపోతే.. స్టార్ హీరో అయినా జనాలు చీ కొట్టి పక్కన పెట్టేస్తారు అని మరోసారి రుజువైంది. 2022లో తెలుగు ఇండస్ట్రీలో భారీ సినిమాలు బోల్తా కొట్టిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. నేషనల్ వైడ్‌గా క్రేజ్ తెచ్చుకున్న సినిమాలు, భారీ హైప్‌తో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. ఇందులో మొదటి వరుసలో చిరంజీవి ఆచార్య సినిమా ఉంటుంది. ఆ తరువాత విజయ్ దేవరకొండ లైగర్ ఉంటుంది. ఇక ప్రభాస్ రాధే శ్యామ్ సైతం అంచనాలు అందుకోలేకపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిరంజీవి ఆచార్య సినిమా అది పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. రామ్ చరణ్ కూడా ఇందులో ఉండటం, పూజా హెగ్డే హీరోయిన్ అవ్వడం, కొరటాల శివ డైరెక్షన్ ఇలా అన్నీ కలిపి ఆచార్యను ఆకాశంలో పెట్టేసింది. కానీ రిజల్ట్ మాత్రం పాతాళ స్థాయిలోకి వచ్చింది. బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆఫ్ ది ఇయర్‌గా ఆచార్య నిలిచింది. దాదాపు తొంభై కోట్లు నష్టం తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఆచార్య దెబ్బకు కొరటాల శివ ఇంత వరకు మొహాన్ని మీడియాకు చూపించుకోలేకపోతోన్నాడు. ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాను ఇంకా మొదలుపెట్టలేకపోతోన్నాడు.


విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్‌లు ఎంతో హడావిడి చేసి తీసిన లైగర్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. విజయ్ అగ్రెసివ్ ప్రమోషన్స్, యాటిట్యూడ్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఇలా అన్నీ కలిసి లైగర్‌ను ముంచేశాయి. దీంతో లైగర్‌ సౌత్, నార్త్‌లో డిజాస్టర్‌గా నిలిచింది. విజయ్ క్రేజ్ ఏ మాత్రం కూడా సినిమాను కాపాడలేకపోయాయి. ఇక ప్రభాస్ రాధే శ్యామ్ హై బడ్జెట్‌ వల్ల డిజాస్టర్‌గా నిలిచింది. సినిమా గ్రాండియర్‌గా ఉన్నా కూడా ఏదో మిస్ అయిన ఫీలింగ్ డార్లింగ్ అభిమానులను వెంటాడింది.


మిడ్ రేంజ్‌ హీరోలు సైతం డిజాస్టర్ల మీద డిజాస్టర్లను ఇచ్చారు. నితిన్ మాచర్ల నియోజకవర్గం ఘోర డిజాస్టర్‌గా నిలిచింది. రామ్ వారియర్ సైతం తుస్సుమంది. వరుణ్ తేజ్ గని సినిమా పరమ నాసిరకమైన సినిమాగా నిలిచింది. ఇలా చాలా మంది హీరోలకు ఈ ఏడాది ఎదురుదెబ్బలు తగిలాయి. మోహన్ బాబు సన్నాఫ్ ఇండియా, మంచు విష్ణు జిన్నాల గురించి చెప్పుకోవడం టైం వేస్ట్.


Also Read : Pooja Hegde Pics : అందుకే త్రివిక్రమ్ పాట రాయించుకున్నట్టున్నాడు.. పూజా హెగ్డే పిక్స్ వైరల్


Also Read : Payal Ghosh : ఎన్టీఆర్ గురించి అప్పుడు చెబితే అంతా నవ్వారు.. పాయల్ ట్వీట్ వైరల్.. చెర్రీ ఫ్యాన్స్ ఫైర్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook