Acharya Trailer Review: మెగా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్.. `ఆచార్య` ట్రైలర్ అదిరిపోయిందిగా!
Acharya Trailer Twitter Review: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. ఏప్రిల్ 29న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్ ను చిత్రబృందం మంగళవారం థియేటర్లలో విడుదల చేసింది. ఆ ట్రైలర్ పట్ల ట్విట్టర్ లో ఫ్యాన్స్ స్పందన ఏంటో తెలుసుకుందాం.
Acharya Trailer Twitter Review: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన మల్టీస్టారర్ మూవీ 'ఆచార్య'. ఏప్రిల్ 29న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ఈ చిత్ర ప్రమోషన్స్ లో చిత్రబృందం జోరు పెంచేసింది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్ ను థియేటర్లలో విడుదలకు మేకర్స్ ప్లాన్ చేశారు. దేశవ్యాప్తంగా దాదాపుగా 152 థియేటర్లలో 'ఆచార్య' మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ను వీక్షించేందుకు మెగా అభిమానులు తండోపతండాలుగా థియేటర్ల వద్ద క్యూ కట్టారు.
'ఆచార్య' ట్రైలర్ చూసిన ప్రతి ఒక్క అభిమాని నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఉన్న సన్నివేశాలు తమకు కన్నుల పండుగగా ఉన్నాయని వారు అంటున్నారు. డైరెక్టర్ కొరటాల శివ సూపర్ వేరియేషన్స్ చూపించగలిగాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే ఈ ట్రైలర్ ను ఈ రోజు రాత్రి (7.02 గంటలకు) సోషల్ మీడియాలో చిత్రబృందం రిలీజ్ చేయనుంది.
'ఆచార్య' సినిమాలో దేవాలయాల బాగు కోసం పాటుపడే పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నారని తెలుస్తోంది. ఇందులో సిద్ధ అనే పాత్రలో రామ్ చరణ్ నటించారు. వీరిద్దరూ కలిసి నక్సలైట్ నాయకులుగా తెరపై కనిపించనున్నారని సమాచారం. ఈ మూవీలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్.. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు.
మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు చిరు సతీమణి కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు. మెలోడీ మాంత్రికుడు మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్స్.. 'లాహే లాహే', 'నీలాంబరి', 'సానా కష్టం' పాటలు ప్రేక్షకులను అలరించాయి.
Also Read: Ananya Nagalla Photos: నడుము అందాలతో కుర్రకారును చంపేస్తావేమో బాల!
Also Read: Naatu Naatu Song Video: ఆర్ఆర్ఆర్ నుంచి సర్ ప్రైజ్.. నాటు నాటు సాంగ్ వీడియో వచ్చేసింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook