Naatu Naatu Song Video: ఆర్ఆర్ఆర్ నుంచి సర్ ప్రైజ్.. నాటు నాటు సాంగ్ వీడియో వచ్చేసింది!

Naatu Naatu Song Video: 'ఆర్ఆర్ఆర్' మూవీ ఫ్యాన్స్ కు ఊహించని సర్ ప్రైజ్! ఈ సినిమాలోని 'నాటు నాటు' పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలోనూ ఈ పాట ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. ఇప్పుడీ పాటకు సంబంధించిన ఫుల్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 11, 2022, 04:05 PM IST
    • 'ఆర్ఆర్ఆర్' మూవీ నుంచి అభిమానులకు సర్ ప్రైజ్
    • సినిమాలోని 'నాటు నాటు' సాంగ్ వీడియో రిలీజ్ చేసిన మేకర్స్
    • మరోసారి సాంగ్ వీడియోను ఆస్వాదిస్తున్న ఫ్యాన్స్
Naatu Naatu Song Video: ఆర్ఆర్ఆర్ నుంచి సర్ ప్రైజ్.. నాటు నాటు సాంగ్ వీడియో వచ్చేసింది!

Naatu Naatu Song Video: రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రణం రుధిరం) బాక్సాఫీస్ ముందు బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రానికి ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ విపరీతమైన క్రేజ్ లభించింది. దీంతో ఈ మూవీ ఇటీవలే కలెక్షన్స్ లో రూ. 1,000 కోట్ల మార్క్ ను దాటేసింది. ఇప్పుడు రూ. 1,500 కోట్ల కలెక్షన్ల వైపు దూసుకెళ్తోంది. 

ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుకు రామ్ చరణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్ చేసిన నటనకు మంచి మార్కులే పడ్డాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరికి జాతీయ అవార్డు వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీలో సంగీతం ప్రముఖ పాత్ర పోషించింది. మొదటి సీన్ నుంచి పతాక సన్నివేశాల వరకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 

ఆర్ఆర్ఆర్ సినిమాలో పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా 'నాటు నాటు' సాంగ్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో ఇప్పుడీ సినిమాలోని 'నాటు నాటు' పాట వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. రామ్​చరణ్, ఎన్టీఆర్ మాస్ స్టెప్పులతో అలరించిన ఈ పాటకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇందులో వీరిద్దరూ కలిసి చేసే హుక్ స్టెప్ సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయ్యింది. ఇప్పుడీ పాట వీడియో కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం ఆ పాటను మరొక్కసారి చూసేద్దాం. 

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని.. దాదాపుగా రూ. 450 కోట్ల బడ్జెట్ తో డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ నటి అలియా భట్, హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటించారు. వీరితో పాటు అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందించారు.   

Also Read: Pranitha Subhash Pregnancy: శుభవార్త చెప్పిన అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణితా సుభాష్!

Also Read: Ranbir Alia Wedding Date: రణ్ బీర్, అలియా పెళ్లి ముహూర్తం ఫిక్స్.. వేడుకకు తరలిరానున్న బాలీవుడ్ ప్రముఖులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News