సృష్టికర్త ఒక బ్రహ్మ అతడిని సృష్టించినదొక అమ్మ.. అని తెలుగు సినిమా పాట చాలా మందికి తెలుసు. నవ మాసాలు మోసి మనల్ని కన్న అమ్మే మనకు తొలి గురువు. అయితే అమ్మ లేకపోతే ఆ లోటును ఎవరూ తీర్చలేరు. ఢిల్లీకి రాజైనా అమ్మకు మాత్రం కొడుకే. సామాన్యులు, సెలబ్రిటీలు అనే భేదం లేకుండా అంతా అమ్మకోసం, ఆమె ప్రేమ కోసం పరితపిస్తుంటారు. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తన తల్లి మోనా కపూర్ జరుపుకున్న చివరి బర్త్ డే ఫొటోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. నేడు మోనా కపూర్ జయంతి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్యాన్సర్‌తో పోరాడుతూ 2012 మార్చి 25న మోనా చనిపోయారు. తన తల్లి చనిపోవడానికి తండ్రి బోనీ కపూర్ రెండో భార్య శ్రీదేవినే కారణమని కొన్నేళ్లపాటు ఆమెను అసహ్యించుకున్నాడు. అయితే శ్రీదేవి చనిపోయిన తర్వాత మాత్రం ఆమె కూతుళ్లను దగ్గరికి తీసుకున్నాడు. చెల్లెళ్లకు తానున్నానంటూ ధైర్యం చెప్పాడు. ఎందుకంటే అమ్మ లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో స్వయంగా అర్జున్ కపూర్ అనుభవించాడు. తల్లి మోనా కపూర్ జయంతిని పురస్కరించుకుని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. అర్జున్ చేసిన పోస్ట్ నెటిజన్లను కదిలిస్తోంది. 



‘హ్యాపీ బర్త్ డే అమ్మ. లవ్ యూ. ఎక్కడున్నా నువ్వు నవ్వుతూనే ఉంటావని ఆశిస్తున్నాను . నువ్వు జరుపుకున్న చివరి పుట్టినరోజు ఫొటో ఇది. నువ్వు మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటావని కోరుకున్నాను. ఈరోజు నిన్ను మిస్సవుతున్నాను. నాకు 25ఏళ్లప్పుడే శాశ్వతంగా దూరమయ్యావు. చాలా రోజులు నన్ను మానసికంగా ఇబ్బందిపడ్డ. నా అల్లరి పనులతో నిన్ను చాలా సతాయించాను. హ్యాపీ బర్త్ డే అమ్మ’ అని తన మనసులోని బాధను వ్యక్తం చేశాడు అర్జున్. కాగా, బోనీ కపూర్, మోనాలకు సంతానం అర్జున్, అన్షులా కపూర్.


కెరీర్ విషయానికొస్తే.. సందీప్ ఔర్ పింకీ ఫరార్ అనే సినిమాలో నటిస్తున్నాడు. దివాకర్ బెనర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అర్జున్‌కు జోడీగా పరిణీతి చోప్రా కనిపించనుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. 


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..