Actor Brahmaji Imitates Prabhas : నటుడు బ్రహ్మాజీ ఈ మధ్య ప్రతీ సినిమాలో కనిపిస్తున్నాడు. కామెడీ పాత్రలు, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ మెప్పిస్తున్నాడు. పైగా బ్రహ్మాజీ నటించిన సినిమాలన్నీ కూడా ఆడుతున్నాయి. అలా నటుడిగా బ్రహ్మాజీకి ఈ సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా ఉన్నట్టుంది. ఇప్పుడు బ్రహ్మాజీ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. శోభన్, ఫరియా నటించిన లైక్ షేర్ సబ్ స్క్రైబ్ సినిమాలో నటించాడు బ్రహ్మాజీ. 
ప్రస్తుతం ఈ మూవీ టీం సుమ క్యాష్ షోకు గెస్టుగా వెళ్లింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలే బ్రహ్మాజీ సోషల్ మీడియాలో ఫుల్ ఫాంలో ఉంటాడు. ట్రెండ్‌ల మీద ఎక్కువగా పట్టు ఉంటుంది. ఏం జరుగుతోందో అని పరిశీలిస్తుంటాడు. ఇక సుమ, బ్రహ్మాజీ ఒకే స్టేజ్ మీద ఉన్నారంటే.. నవ్వులే నవ్వులు. ఈ క్యాష్ షోకు ఇది వరకు చాలా సార్లు వచ్చాడు బ్రహ్మాజీ. ఇప్పుడు ఫరియా, శోభన్‌లతో కలిసి సందడి చేసేందుకు వచ్చాడు. అయితే ఇందులో ఓ సందర్భంలో బ్రహ్మాజీ ఫోటో పక్కన ఫరియా ఫోటోను పెడుతుంది సుమ. ఎంత బాగుందో కదా? అని సుమ అంటే.. కొందరు నవ్వుతారు.


 



ఎవడ్రానవ్వింది.. కమ్ టు మై రూం అని వార్నింగ్ ఇస్తాడు. ఇది ప్రభాస్ స్టైల్లో చెప్పాడు.ఎందుకంటే ఆదిపురుష్‌ టీజర్ రిలీజ్ అయిన తరువాత ప్రభాస్ వీడియో ఒకటి వైరల్ అయింది. వేర్ ఈజ్ ఓం.. ఓం కం టు మై రూం అంటూ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఆదిపురుష్‌ టీజర్ బాగా లేకపోవడంతో ప్రభాస్ సీరియస్ అయ్యాడు.. ఓం రౌత్‌కు వార్నింగ్ ఇచ్చాడంటూ అందరూ ప్రచారం చేశారు ఆ వీడియోని.


ఇప్పుడు అదే టోన్‌లో బ్రహ్మాజీ కూడా కౌంటర్ వేశాడు. ఇలా ట్రెండింగ్ అంశాల మీద మంచి గ్రిప్ సాధిస్తుంటాడు బ్రహ్మాజీ. తన సోషల్ మీడియా ఖాతాల్లోనూ ఇలానే కౌంటర్లు వేస్తుంటాడు. బ్రహ్మాజీ సోషల్ మీడియాలో ఒక్కోసారి దూకుడుగా ఉంటాడు. అదే కొన్ని సార్లు కాంట్రవర్సీకి దారి తీస్తుంటుంది. అందుకే మధ్య మధ్యలో సోషల్ మీడియాకు గ్యాప్ ఇస్తుంటాడు.


ప్రస్తుతం బ్రహ్మాజీ ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకపోతోన్నాడు. అదే సమయంలో తన కొడుకు సినిమాల మీద కూడా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఓ పిట్టకథ కోసం బ్రహ్మాజీ తనకు చేతనైన సాయాన్ని చేసిన సంగతి తెలిసిందే.


Also Read : Jr NTR - Chiranjeevi : నాడు అలా నేడు ఇలా.. చిరంజీవిపై యంగ్ టైగర్.. ఎన్టీఆర్‌లో ఎంత మార్పు?


Also Read : Puri Jagannadh Complaint : పూరి ఫిర్యాదు.. ఫైనాన్షియర్ శోభన్ సంచలన వ్యాఖ్యలు.. ఎక్కడా కనిపించని ఛార్మీ?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి