Spirit: స్పిరిట్ స్టార్ కాస్ట్ పై డైరెక్టర్ స్పందన.. అందుకే మెగా పేరు వచ్చిందంటూ..?
Chiranjeevi in Spirit: గత కొద్దిరోజులుగా మెగాస్టార్ చిరంజీవి స్పిరిట్ సినిమాలో నటిస్తున్నారు అంటూ తెగ వార్తలు వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో.. చిరంజీవికి ప్రత్యేక పాత్ర ఇచ్చారు అని ఎన్నో వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగ ఈ విషయంపై స్పందించారు..
Spirit Update: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూ.700 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన కల్కి 2898AD సినిమాలో నటించి, తన అద్భుతమైన నటనతో తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఇందులో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే , రాజేంద్రప్రసాద్ లాంటి భారీ తారాగణం భాగమైన విషయం తెలిసిందే.
ఇక మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ, మారుతి డైరెక్షన్లో రాజా సాబ్ సినిమా చేస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం రాజాసాబ్ సినిమా షూటింగ్లో బిజీగా పాల్గొంటున్న ఈయన వచ్చే ఏడాది సమ్మర్ హాలిడేస్ కు సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక మరొకవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అసలే యానిమల్ సినిమాతో ఊచకోతకు అర్థం చూపించిన సందీప్ రెడ్డి వంగా ఈసారి అంతకుమించి అనేలా ప్రభాస్ ను హైలైట్ చేస్తాడనే నమ్మకం అభిమానులలో ఉంది .స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న సందీప్ .. పనిలో పనిగా ఇంపార్టెంట్ పాత్రల గురించి కొంతమంది స్టార్ నటులను కూడా సంప్రదిస్తున్నట్లు వార్త వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా సందీప్ ఒక కీలక పాత్ర కోసం మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పై ఫోకస్ పెంచినట్లు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆయనది ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర అని , హీరోకి తండ్రిగా కనిపించనున్నారు అని, ఇలా రకరకాల గాసిప్స్ పుట్టుకొచ్చాయి. నిజానికి సందీప్ ఎవరిని కూడా ఫైనల్ చేయలేదంట. ఇప్పటివరకు నేరుగా వెళ్లి ఏ ఒక్క నటుడిని కలవలేదని తెలుస్తోంది. కేవలం చర్చల దశలోనే కొంతమంది నటులను అనుకోగా అందులో మమ్ముట్టి పేరు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తెలుగు ప్రేక్షకులకు యాత్ర సినిమాతో బాగా దగ్గరైన మమ్ముట్టి ఆమధ్య అఖిల్ ఏజెంట్ సినిమాలో కూడా కీలకపాత్ర పోషించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా మారింది. ఇక ఎందుకో అప్పటినుంచి ఆయన తెలుగులో సపోర్టింగ్ క్యారెక్టర్స్ వచ్చినా ఒప్పుకోలేదు. ఇప్పుడు స్పిరిట్ అంటే తప్పనిసరిగా ప్రభాస్ కోసం అయినా నటిస్తారు అంటూ వార్తలు వినిపించగా.. ఇందులో ఎంత నిజమో ఉందో తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter