Mahesh Babu new look: కరోనా (Coronavirus) లాక్‌డౌన్ వలన సెలబ్రిటీలందరూ దాదాపు ఏడు నెలలు ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తన ఫ్యామిలీతో కలిసి ఇటీవల వెకేష‌న్‌కు వెళ్లారు. అయితే వెకేషన్‌కు వెళ్లేముందు హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన మహేష్ ఫ్యామిటీ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఆ తర్వాత ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ, అక్క‌డి అప్‌డేట్స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు మహేష్, నమ్రత దంపతులు. ఈ క్రమంలో మహేష్ బాబు న్యూలుక్ సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. Also read: Krithi Shetty: చూపులతో చంపేస్తున్న ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహేష్ బాబు ఇటీవల ఫొటోలను చూసి సంబరపడిన అభిమానులు.. ఇప్పుడు నమ్రతా శిరోద్కర్ ఇన్‌స్టాలో పంచుకున్న మహేష్ డైనమిక్ లుక్‌ను చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఎయిర్ పోర్ట్‌లో మహేష్ హూడితో గాగుల్స్ పెట్టుకొని దిగిన ఫొటోను నమ్రతా షేర్ చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు ఇలా ఎవరైనా కనిపిస్తారా అంటూ ఆమె క్యాప్షన్ కూడా రాశారు. ఈ ఫొటోలో మ‌హేష్ చాలా యంగ్‌గా డైనమిక్ లుక్‌తో క‌నిపిస్తున్నారు. అయితే మహేష్ న్యూ లుక్‌ను చూసి.. వ‌య‌సు పెరుగుతున్న కొద్ది.. చాలా అందంగా కనిపిస్తున్నారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  


Also read: Bharat Biotech: కోవాక్సిన్ తుది దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి