Nagababu Indirect Counter to Jagan: మెగా బ్రదర్ నాగబాబు ఒకపక్క టీవీ షోలలో బిజీగా ఉంటూనే మరోపక్క తన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చెందిన జనసేన పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. తమ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న ఆయన మరోపక్క వైసీపీ, తెలుగుదేశం పార్టీల మీద వీలు చిక్కినప్పుడల్లా విమర్శలు చేస్తూ వస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యనే భీమవరంలో జరిగిన సభ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు నాగబాబు. ఈనెల నాలుగో తేదీ అల్లూరి సీతారామరాజుకు చెందిన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి మోదీ ఆవిష్కరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వంటి వారు పాల్గొన్నారు. నాగబాబు మాట్లాడుతూ భీమవరంలో నాలుగో తేదీన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభ అద్భుతంగా జరిగిందని ఈ సభలో మా అన్నయ్య చిరంజీవి తప్ప మిగతా వాళ్ళందరూ మహానటుల్లాగా బాగా నటించారని చెప్పుకొచ్చారు. ఆయన టార్గెట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అలాగే ఆ పార్టీకి చెందిన పర్యాటక శాఖ మంత్రి రోజాని అనే సంగతి ఈజీగా అర్థమవుతుంది. 


ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్నా కూడా జనసేన పార్టీకి ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆహ్వానం అందలేదు. అదే సమయంలో ఎలాంటి లింక్ లేకుండా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించడంతో జనసేనను బిజెపి కావాలనే పక్కన పెడుతోంది అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అదేమీ లేదని, క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు నాగబాబు చేసిన కామెంట్లు మాత్రం ఏపీ రాజకీయాల్లోనే కాక సినీ వర్గాల్లో కూడా చర్చనీయాంశం అయ్యాయి. దానికి కారణం ఆయన ఇప్పుడు మహానటులు అంటూ పరోక్షంగా కామెంట్ చేసిన రోజాతో ఆయన జబర్దస్త్ ప్రోగ్రాంలో చాలా రోజులు పాటు సహ జడ్జిగా వ్యవహరించారు.


Also Read: Kaali poster row: ఇంత వివాదం జరుగుతుంటే మరో వివాదాస్పద ఫోటో షేర్ చేసిన లీనా మణిమేఖలై


Also Read: Actor sreejith ravi arrested: కారులో నుంచి నగ్నంగా దిగిన స్టార్ నటుడు.. సీసీ కెమెరాలో చూసి అరెస్ట్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య,     ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook