Actor sreejith ravi arrested: కారులో నుంచి నగ్నంగా దిగిన స్టార్ నటుడు.. సీసీ కెమెరాలో చూసి అరెస్ట్!

Actor sreejith ravi arrested: మైనర్ స్కూల్ పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలపై శ్రీజిత్ రవిని కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  ఈ సంఘటన జూలై 4న త్రిసూర్‌లో చోటు చేసుకుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 7, 2022, 02:06 PM IST
  • మైనర్ పిల్లలతో మళయాళ నటుడు అసభ్యకర ప్రవర్తన
  • షూటింగ్ స్పాట్లో అరెస్ట్ చేసిన పోలీసులు
  • గతంలో కూడా ఇలాంటి కేసులో చిక్కిన నటుడు
 Actor sreejith ravi arrested: కారులో నుంచి నగ్నంగా దిగిన స్టార్ నటుడు.. సీసీ కెమెరాలో చూసి అరెస్ట్!

Actor Sreejith Ravi arrested on POCSO act: కేరళకు చెందిన ప్రముఖ మలయాళ నటుడు శ్రీజిత్ రవికి సంబంధించి షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. మైనర్ స్కూల్ పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలపై శ్రీజిత్ రవిని కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నటుడు శ్రీజిత్ రవిని సెక్షన్ 11 కింద అరెస్ట్ చేశారు. సెక్షన్ 11 POCSO లైంగిక నేరాల నుండి పిల్లల్ని రక్షించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. శ్రీజిత్ రవిని కేరళలోని త్రిసూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన గత జూలై 4 న జరిగినట్టు చెబుతున్న క్రమంలో పోలీసులు తాజాగా ఆయనని అరెస్టు చేశారు. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం ఈ సంఘటన జూలై 4న త్రిసూర్‌లో చోటు చేసుకుంది. 

ఇద్దరు మైనర్ బాలికలు రోడ్డు పక్క నుంచి వెళుతున్న సమయంలో నటుడు శ్రీజిత్ తన కారులో కూర్చుని ఉన్నాడు. వాళ్ళు అలా వెళ్తున్న సమయంలో ఒంటిపై బట్టలు లేకుండా శ్రీజీత్ న్యూడ్ గా తన కారులో నుంచి దిగి న్యూసెన్స్ ను క్రియేట్ చేసినట్లు వాళ్ళు తమ ప్రధానోపాధ్యాయుడికి సమాచారం అందించారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేశారు. ఈ సందర్భంగా కారు నెంబర్ ఆధారంగా శ్రీజిత్‌పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. 

ఇక ఈ విషయంలో తన తప్పేమీ లేదని అయన ఖండించినా అతను చెప్పేది నిజం కాదని నిర్ధారించుకున్న పోలీసులు ఆయనని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. ఇక ఆయనని ఒట్టపాలన్‌లోని సినిమా షూటింగ్ సైట్ నుండి వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక శ్రీజిత్ తమను మొబైల్‌లో చిత్రీకరించారని, అసభ్యకర సంజ్ఞలు కూడా చేశారని విద్యార్థినులు తమ ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. 

శ్రీజిత్‌పై ఇలాంటి అసభ్యకర చర్యలకు పాల్పడడం ఇదే తొలిసారి కాదు, కొన్నాళ్ల క్రితం కూడా శ్రీజిత్‌పై ఇలాంటి కేసు నమోదైనట్లు తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, పాలక్కాడ్‌కు చెందిన 14 మంది పాఠశాల విద్యార్థినుల బృందంతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడని వెలుగులోకి వచ్చిన క్రమంలో ఆయనని అరెస్టు చేశారు. ఆ సమయంలో ఆయనకు బెయిల్ వచ్చింది. అయితే ఆ తర్వాత ఆ కేసు నుంచి శ్రీజిత్ తప్పించుకున్నాడు. 46 ఏళ్ల శ్రీజిత్ వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్ అయినా మేనేజ్‌మెంట్ డిగ్రీ కూడా చదివాడు. మలయాళ సీనియర్ నటుడు టీజీ రవి తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీజీత్ రవి, 2005లో మయూఖం సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఇప్పటిదాకా ఆయన 70కి పైగా చిత్రాల్లో నటించారు.

Also Read: Samantha Ruthprabhu: సమంత బాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్ ఫిక్స్.. ఆ స్టార్ హీరోతోనే మొదటి సినిమా?

Also Read: Kaali poster row: ఇంత వివాదం జరుగుతుంటే మరో వివాదాస్పద ఫోటో షేర్ చేసిన లీనా మణిమేఖలై

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య,     ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook

Trending News