Bigg Boss- 4: ఎంట్రీపై ముందే క్లారిటీ ఇచ్చిన నందు
టాలీవుడ్ హీరోగా, పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్నాడు.. నటుడు నందు (Actor Nandu). అయితే ఆయన బిగ్‌బాస్ సీజన్-4 (Telugu Bigg Boss- 4)లో పాల్గొంటున్నట్లు కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై హీరో నందు ముందే క్లారిటీ ఇచ్చాడు.
Actor Nandu clarity on Telugu Bigg Boss- 4: టాలీవుడ్ హీరోగా, పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్నాడు.. నటుడు నందు (Actor Nandu). అయితే ఆయన బిగ్‌బాస్ సీజన్-4 (Telugu Bigg Boss- 4)లో పాల్గొంటున్నట్లు కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై హీరో నందు ముందే క్లారిటీ ఇచ్చాడు. తాను తెలుగు బిగ్‌బాస్ సీజన్-4లో పాల్గొంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. బిగ్‌బాస్ షోలో తన ప్రయాణాన్ని కొనసాగించడానికి తనకు మద్దతు ఇవ్వాలంటూ.. నందు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులను కోరాడు. Also read: Building Collapsed : ఇద్దరు మృతి.. చాలామంది శిథిలాల కిందనే..!
నందు మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో BIGG అనౌన్స్‌మెంట్ చేయబోతున్నా అని పోస్ట్ పెట్టాడు. ఆ తర్వాత .. డార్లింగ్స్.. నేను బిగ్ బాస్ షోకి వస్తున్నా.. బీబీలో మన రచ్చ మామూలుగా ఉండదు. అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. నాకు మీ సపోర్ట్ కావాలి.. రేపు సాయంత్రం ఆరు గంటలకు ఇంకో అప్డేట్ ఇస్తున్నా రెడీగా ఉండండి.. అంటూ మరో పోస్ట్ చేశాడు. ఇదిలాఉంటే.. నందు భార్య గీతా మాధురి కూడా బిగ్‌బాస్ సీజన్-2 షోలో కంటెస్టెంట్‌గా పాల్గొని కౌశల్‌కి గట్టి పోటీని ఇచ్చిన విషయం తెలిసిందే. Also read: TSCETS 2020: తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే..
బిగ్‌బాస్ షో పోటీదారుల జాబితా గురించి చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు చాలా మంది సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే బిగ్ బాస్ షోలో పాల్గొనే వారు ఎవరు ముందుగా అనౌన్స్ చేయకూడదు. కాని నందు ముందే ఎంట్రీపై క్లారిటీ ఇవ్వడంతో ప్రస్తుతం నందు చర్చల్లో నిలిచాడు.