Building Collapsed : ఇద్దరు మృతి.. చాలామంది శిథిలాల కిందనే..!

మహారాష్ట్ర  ( Maharashtra ) లో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని రాయ్‌ఘడ్ ( Raigad District ) జిల్లా మహద్‌ తాలుకాలోని కాజల్‌పురా  ( kajalpura ) లో ఐదు అంతస్తుల భవనం కుప్పకూలిన విషయం మనందరికీ తెలిసిందే.

Last Updated : Aug 25, 2020, 09:10 AM IST
Building Collapsed : ఇద్దరు మృతి.. చాలామంది శిథిలాల కిందనే..!

Maharashtra building collapsed: మహారాష్ట్ర  ( Maharashtra ) లో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని రాయ్‌ఘడ్ ( Raigad District ) జిల్లా మహద్‌ తాలుకాలోని కాజల్‌పురా  ( kajalpura ) లో ఐదు అంతస్తుల భవనం ( building collapsed) కుప్పకూలిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే భవన శిథిలాల కింద సుమారు 90 మంది చిక్కుకున్నట్లు చెబుతున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ దళాలు ( NDRF teams) రెస్క్యూ నిర్వహిస్తూనే ఉన్నాయి. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందారు. ఇంకా శిథిలాల కింద 18వరకు ఉంటారని భావిస్తున్నట్లు రాయ్‌ఘడ్ జిల్లా కలెక్టర్ నిధి చౌదరి తెలిపారు. Also read: Maharashtra: కుప్పకూలిన ఐదంస్తుల భవనం..శిధిలాల కింద 50 మంది ?

ఇదిలాఉంటే.. ఇప్పటివరకు శిథిలాల కింద చిక్కుకున్న 60 మందిని రెస్క్యూ చేసి కాపాడినట్లు మంత్రి అదితి తట్కరే వెల్లడించారు. ఈ ఘటనలో 17మంది వరకు గాయపడ్డారని .. వారందరినీ సమీపంలో ఉన్న ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. సహాయక చర్యలు వేగంగా చేపడుతన్నామని, ఈ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించినట్లు ఆమె వెల్లడించారు. Also read: Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!

Trending News