Cheating Case against Actor Naresh Ex Wife: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతిపై హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. నరేష్‌ పలుకుబడిని అడ్డుపెట్టుకుని రమ్య రఘుపతి పలువురి నుంచి భారీ వసూళ్లు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రమ్య రఘుపతి హిందూపురం, అనంతపురం, హైదరాబాద్‌లలో పలువురి నుంచి భారీగా అప్పులు తీసుకున్నట్లు చెబుతున్నారు. నరేష్ ఆస్తులను తన ఆస్తులుగా చెప్పుకుంటూ ఆమె ఈ అప్పులు చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని మోతీ మహల్‌తో తనదేనని, మారియట్ హోటల్‌లో తనకు వాటాలు ఉన్నాయని చెప్పి రమ్య రఘుపతి మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పలు సంస్థల పేరిట ఆమె డబ్బులు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది.


రమ్య రఘుపతిపై తాజాగా ఐదుగురు మహిళలు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదు చేశారు. మరోవైపు రమ్య రఘుపతి వసూళ్ల వ్యవహారంతో తనకే సంబంధం లేదన్నారు నటుడు నరేష్. రమ్య రఘుపతి నరేష్‌కు మూడో భార్య. ఏడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరూ.. కొన్నాళ్ల కాపురం తర్వాత విడిపోయారు. ప్రస్తుతం రమ్య రఘుపతి ఎక్కడ ఉన్నారనేది తెలియరాలేదు. ఆమె ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. రమ్య రఘుపతి బాధితులు ఇంకా చాలామందే ఉండొచ్చునని భావిస్తున్నారు. 


Also Read: RJ Rachana: పాపులర్ రేడియో జాకీ రచన హఠాన్మరణం.. పునీత్ లాగే చిన్న వయసులో గుండెపోటుతో మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook