RJ Rachana: పాపులర్ రేడియో జాకీ రచన హఠాన్మరణం.. పునీత్ లాగే చిన్న వయసులో గుండెపోటుతో..

Radi Jockey Rachana Passes Away: కన్నడ రేడియో జాకీ రచన గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈ ఉదయం గుండెపోటుకు గురైన ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2022, 04:57 PM IST
  • కన్నడ రేడియో జాకీ రచన హఠాన్మరణం
  • 39 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మృతి చెందిన రచన
  • ఈ ఉదయం గుండెపోటు రాగా ఆసుపత్రికి తరలింపు
  • అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించిన వైద్యులు
RJ Rachana: పాపులర్ రేడియో జాకీ రచన హఠాన్మరణం.. పునీత్ లాగే చిన్న వయసులో గుండెపోటుతో..

Radi Jockey Rachana Passes Away: బెంగళూరుకు చెందిన పాపులర్ రేడియో జాకీ రచన (39) గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం (ఫిబ్రవరి 22) జేపీ నగర్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఆమె గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే రచన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు కన్నడ మీడియా వార్తలను ప్రసారం చేసింది.

ఆర్జేగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రచన హఠాన్మరణం చాలామందిని షాక్‌కి గురిచేసింది. గత పదేళ్లుగా ఆర్జే రచన బెంగళూరులోని ప్రతీ ఇంట్లో సుపరిచితురాలిగా మారిందంటే అతిశయోక్తి కాదు. తన వాక్చాతుర్యం, సెన్సాఫ్ హ్యూమర్‌తో ఆమె ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆర్జే రచన ప్రోగ్రామ్స్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారు ఆమె మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు.

ఆర్జే రచన భౌతిక కాయాన్ని చామరాజ్‌పేట్‌లోని ఆమె తల్లిదండ్రుల నివాసానికి తరలించినట్లు తెలుస్తోంది. అంత్యక్రియలకు సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. 

గతేడాది అక్టోబర్ 29న కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (46) గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా గుండెపోటుకు గురై పునీత్ మరణించారు. చిన్న వయసులోనే పునీత్ ఈ లోకాన్ని వీడటం అభిమానులను తీవ్రంగా కలచివేసింది. తాజాగా ఆర్జే రచన సైతం చిన్న వయసులోనే మరణించడం ఆమె అభిమానులను కలచివేస్తోంది. 

Also Read: Varun Tej Ghani: బాబాయ్ 'భీమ్లా నాయక్' ఎఫెక్ట్.. వరుణ్ తేజ్ 'గని' మరోసారి వాయిదా..

Also Read: Bandla Ganesh Audio Leak: త్రివిక్రమ్ నన్ను రావొద్దంటున్నాడు.. 'భీమ్లా నాయక్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై బండ్ల గణేష్ సంచలన కామెంట్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News