Hero Nikhil: థియేటర్లు మూతపడటం చూస్తుంటే గుండె పగిలిపోతుంది: నిఖిల్
Nikhil: కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు మూతపడటం చూస్తుంటే తన హృదయం ముక్కలవుతోందని టాలీవుడ్ యువనటుడు నిఖిల్ అన్నారు.
Actor Nikhil: గత కొన్ని రోజులుగా టికెట్స్ రేట్స్ విషయంపై ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ ఇండస్ట్రీకి కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) టికెట్స్ రేట్స్ తగ్గిస్తూ జీవో జారీ చేయటంతో...థియేటర్ యజమానులు, నిర్మాతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టికెట్ ధరలు తగ్గిపోవడంతో..థియేటర్లు (Theaters) నడపలేమంటూ మూసివేస్తున్నారు యాజమానులు. తాజాగా ఈ విషయంపై స్పందించారు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ (Actor Nikhil). సినిమా టికెట్ల ధరల (Ticket Rates) విషయంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. ఈ మేరకు నిఖిల్ ట్వీట్స్ చేశారు.
''ప్రతి సింగిల్ స్క్రీన్ థియేటర్ లో రూ. 20 టికెట్ కూడా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు అందుబాటులో ఉండే ధరల్లోనే థియేటర్స్ ఉన్నాయి. రైళ్లలో వివిధ తరగతులకు చెందిన కంపార్ట్ మెంట్స్ ఉంటాయి కదా.. అలాగే థియేటర్లలోని బాల్కానీ, ప్రీమియమ్ సెక్షన్స్ టికెట్ ధరల్లో సవరింపులు చేయాలని కోరుకుంటున్నాను''అంటూ నిఖిల్ ట్వీట్ చేశాడు.
Also Read: Vijay Devarakonda: సినిమా టికెట్ ధరల పెంపుపై విజయ్ దేవరకొండ హర్షం..వైరల్ గా రౌడీ హీరో ట్వీట్..
''థియేటర్స్ నాకు గుడితో సమానం.. ఎప్పుడు ప్రజలకు ఆనందాన్ని ఇస్తుంటాయి. అలాంటి థియేటర్స్ మూతపడడం చూస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మద్దతు చూస్తుంటే సంతోషంగా ఉంది. అదే విధంగా థియేటర్స్ మళ్లీ కళ కళలాడేలా ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాను'' అంటూ మరో ట్వీట్ లో పేర్కొన్నాడు నిఖిల్. ప్రస్తుతం 18 పేజీస్ సినిమాలో నటిస్తున్నాడు నిఖిల్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి