Vijay Devarakonda: సినిమా టికెట్ ధరల పెంపుపై విజయ్ దేవరకొండ హర్షం..వైరల్ గా రౌడీ హీరో ట్వీట్..

Vijay Devarakonda: తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను పెంచుతూ..నిర్ణయం తీసుకోవడంపై రౌడీహీరో విజయ్ దేవరకొండ హర్షం వ్యక్తం చేశాడు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2021, 04:32 PM IST
Vijay Devarakonda: సినిమా టికెట్ ధరల పెంపుపై విజయ్ దేవరకొండ హర్షం..వైరల్ గా రౌడీ హీరో ట్వీట్..

Vijay Devarakonda: తెలంగాణలో సినిమా టికెట్‌ రేట్లను పెంచుతూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హర్షం వ్యక్తం చేశారు. తాజాగా రౌడీ హీరో విజయదేవరకొండ (Vijay Devarakonda) స్పందిస్తూ..తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) పై ప్రశంలు కురిపించాడు. తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని అన్నాడు.

రాష్ట్రంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం ప్రభుత్వం, సీఎం కేసీఆర్, కేటీఆర్, తలసానిలు ఎంతో కృషి చేస్తున్నారని అన్నాడు విజయ్. తెలంగాణ ప్రభుత్వం నూటికి నూటొక్క శాతం సినీ పరిశ్రమను పరిశ్రమగా మార్చాలని ఆలోచిస్తోందంటూ ట్వీట్ చేశారు. “''నేను నా ప్రభుత్వాన్ని ప్రేమిస్తున్నాను… తెలుగు చలన చిత్ర పరిశ్రమ దేశంలోనే అతి పెద్ద పరిశ్రమ”''అంటూ విజయ్ చేసిన ట్వీట్ (Tweet) ఇప్పుడు వైరల్ గా మారింది. 

Also Read: Chiru Thanks to KCR: సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి.. సీఎం కేసీఆర్ కు మెగాస్టార్ కృతజ్ఞతలు

టికెట్ ధరల (TS Ticket Rates) ను పెంచాలన్న టాలీవుడ్ సినీ పరిశ్రమ అభ్యర్థనకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.  అందుకు అనుగుణంగా  కొత్త జీవోను కూడా జారీ చేసింది. సదరు జీవో ప్రకారం, జీఎస్టీ మినహా ఏసీ థియేటర్లకు కనీస టిక్కెట్ ధర రూ.50, గరిష్టంగా రూ.150గా, మల్టీప్లెక్స్‌లలో కనీస టిక్కెట్ ధర రూ. 100+జీఎస్టీ, గరిష్టంగా రూ.250+జీఎస్టీలతో ధరలను నిర్ణయించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రిక్లైనర్ సీట్లకు రూ. 200 + జీఎస్టీ, మల్టీప్లెక్స్‌లలో రూ. 300 + జీఎస్‌టీ.. టిక్కెట్‌కు రూ. 5 (ఎసి) మరియు టిక్కెట్‌కు రూ. 3 (నాన్ ఎసి) నిర్వహణ ఛార్జీని వసూలు చేయడానికి థియేటర్‌లకు అనుమతి లభించడంపై సినీప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా టికెట్ల ధర విషయంలో ఏపీ ప్రభుత్వానికి (AP Govt), టాలీవుడ్ ఇండస్ట్రీకి కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టికెట్ల రేట్లు తగ్గించడంతో సినిమా నిర్మాతలకు నష్టం వాటిల్లుతుందని నిర్మాతలు అంటున్నారు. పలువురు హీరోలు కూడా ఏపీ ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News