Actor Nithin Condemns Caste Propaganda: టాలీవుడ్ దర్శకుడు ఒకరు కుల వివాదంలో చిక్కుకున్నారు. గతంలో ఆయన కొన్ని కులాలను టార్గెట్ చేసినట్టు ట్వీట్లు వైరల్ అయ్యాయి. అయితే తాను ఇతర కులాలను కించపరచ లేదని ఆయన ప్రస్తుతం చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో హీరో నితిన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. అయితే అసలు విషయం ఏమిటంటే నితిన్ హీరోగా రాజశేఖర్ రెడ్డి అనే దర్శకుడు మాచర్ల నియోజకవర్గం అనే సినిమా చేస్తున్నారు. గతంలో పలు సినిమాలకు ఎడిటర్ గా వ్యవహరించిన  ఆయన మాచర్ల నియోజకవర్గం అనే సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో రెండు అగ్రకులాలను ఆయన కించపరిచారు అంటూ ఒక ట్వీట్ వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే అది తాను చేసిన ట్వీట్ కాదని రాజశేఖర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను స్వతహాగా వైయస్సార్ అభిమానినని ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నా అభిమానాన్ని వ్యక్తం చేశాను తప్ప వేరే కులానికి చెందిన వారిని తిట్టలేదు అంటూ తాజాగా ఆయన ట్వీట్ చేశారు. తనకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ప్రచారం జరుగుతూ ఉండడం సినిమా చూడవద్దని ఆ రెండు కులాల వారిని సోషల్ మీడియాలో కోరుతూ ఉండడంతో రాజశేఖర్ రెడ్డి స్పందించారు.


ఈ స్క్రీన్ షాట్ లో ఉన్న ట్వీట్ ఫేక్ అంటూ ఎవరో కావాలని ఎడిట్ చేసి దీనిపై నెగెటివ్స్ స్ప్రెడ్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కింద స్క్రీన్ షాట్ లో ఉన్న పేరు డిఫరెంట్,  ఫోటోషాప్ చేసినవాడు ఎవరో సరిగా చేయలేదు అంటూ సోషల్ మీడియాలో ఆయన పేర్కొన్నారు. ఇక ఇదే విషయం మీద స్పందించిన నితిన్ ''ఒక నకిలీ వ్యక్తి చేసిన ఫేక్ ట్వీట్ అనవసరమైన రచ్చ సృష్టించింది, దురదృష్టవశాత్తు ఇది ఇతరుల మనోభావాలను దెబ్బతీసింది.



ఇది చాలా విచారకరం,ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను అంటూ ఆయన పేర్కొన్నారు. ఇక మాచర్ల నియోజకవర్గం సినిమాకి విషయానికి వస్తే నితిన్ సరసన కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఇక ఒక స్పెషల్ సాంగ్లో అంజలి నర్తించగా ఇప్పటికే ఆ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహతి స్వర సాగర సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, ఆయన సోదరి నికిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ప్రసాద్ మూరెళ్ళ కెమెరా అందిస్తూ ఉండగా ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించారు. మరి ఈ ఫేక్ ట్వీట్ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో చూడాలి.
Read Also: Ranveer singh Viral Video: పాపం బట్టల్లేవు.. దానం చేయండయ్యా!


Read Also:Producers Guild: ఆగష్టు 1 నుంచి షూటింగ్స్ బంద్.. మళ్లీ ఎప్పటి నుంచి అంటే!