Ranveer singh Viral Video: పాపం బట్టల్లేవు.. దానం చేయండయ్యా!

Clothes Donation Drive to Ranveer singh: రణవీర్ సింగ్ నగ్నంగా ఫోటోషూట్ చేయడం మీద బాలీవుడ్ హీరో హీరోయిన్లు ప్రశంసల వర్షం కురిపిస్తుంటే సాధారణ ప్రజానీకం మాత్రం మండిపడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 26, 2022, 08:30 PM IST
Ranveer singh Viral Video: పాపం బట్టల్లేవు.. దానం చేయండయ్యా!

Clothes Donation Drive to Ranveer Singh: ఒక ప్రముఖ మ్యాగజైన్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ పూర్తిగా నగ్నంగా మారి ఫోటో షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా తన ప్రైవేట్ పార్ట్స్ కనిపించకుండా జాగ్రత్త పడిన ఆయన ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. రణవీర్ సింగ్ ఇలా ఫోటోషూట్ చేయడం మీద బాలీవుడ్ హీరో హీరోయిన్లు ప్రశంసల వర్షం కురిపిస్తుంటే సాధారణ ప్రజానీకం మాత్రం మండిపడుతున్నారు. ఫ్యాషన్ పేరుతో ఇలా గుడ్డలు విప్పుకుని ఫోటోలు పెట్టడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు.

ఇదేం పైత్యం?  జనానికి ఏం మెసేజ్ ఇద్దామని ఇలా రెచ్చిపోయి బట్టలు విప్పి తీసి ఫోటో షూట్ లు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. అయితే రణవీర్ సింగ్ మీద చర్యలు తీసుకోవాలంటూ ముంబైలో అనేక చోట్ల పోలీసులకు ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. ఇప్పటికే ఒకచోట ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు కొంతమంది సంప్రదాయవాదులు రన్వీర్ సింగ్ ఫోటోషూట్ ను పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక వినూత్న నిరసన చేపట్టారు.

ఆయన నగ్నంగా కూర్చున్న ఫోటో పక్కన ఒక బాక్స్ ఏర్పాటు చేసి డబ్బులు లేక ఇలా బట్టలు లేకుండా ఉంటున్న వ్యక్తికి బట్టలు ఇవ్వాలని కోరుతూ ఉండడంతో ఏకంగా కొంత మంది కొత్త దుస్తులను దానం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇలాంటి వివాదాస్పద అంశాలు ఎప్పుడు దొరుకుతాయా ఎప్పుడు మాట్లాడదామా అని ఎదురు చూస్తూ ఉండే రామ్ గోపాల్ వర్మ సైతం ఇది సమానత్వానికి ప్రతీక అంటూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

రణవీర్ మాదిరి ఒక అమ్మాయి ఇలా నగ్న ఫొటోస్ షేర్ చేసినా  అభినందించాలని అప్పుడే లింగ సమానత్వం సాధించినట్లు అంటూ ఆయన ట్వీట్లు చేయడం ఆసక్తికరంగా మారింది. అంతే కాకుండా అమ్మాయిలు నగ్న చిత్రాలను అబ్బాయిలు ఎంజాయ్ చేసినంతగా అమ్మాయిల కూడా అబ్బాయిల నగ్న ఫోటోలు చూసి ఎంజాయ్ చేస్తారా అంటూ ఆయన పెట్టిన పోల్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read Also: Niharika Konidela: శుభవార్త చెప్పడానికి సిద్దమైన నిహారిక.. త్వరలో ప్రకటన!

Read Also: Producers Guild: ఆగష్టు 1 నుంచి షూటింగ్స్ బంద్.. మళ్లీ ఎప్పటి నుంచి అంటే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News