Rahul Ramakrishna Getting Married : నటుడిగా కొద్ది సినిమాలతోనే తనదైన ప్రత్యేకత చాటుకున్న రాహుల్ రామకృష్ణ... తన భావాలను ప్రకటించడంలోనూ అంతే ప్రత్యేకంగా ఉంటాడు. సమకాలీన అంశాలపై సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తన భావాలను తెలియజేస్తుంటాడు. తాజాగా ఈ నటుడు తన పెళ్లి గురించి తనదైన స్టైల్లో ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశాడు. తనకు కాబోయే భార్యను ముద్దు పెట్టుపెట్టుకున్న ఫోటో ట్విట్టర్‌లో షేర్ చేసి... 'త్వరలో.. మొత్తానికి పెళ్లి చేసుకోబోతున్నా...' అని ప్రకటించాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాదు, ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌ను ఉద్దేశించి మరో ట్వీట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేను షేర్ చేసిన ఫోటోపై చర్చ కోసం పిలవండి.. ఎందుకు పిలవకూడదు..? నేను, నాకు కాబోయే భార్య తప్పకుండా వస్తాం. పదండి... మెరుగైన సమాజం కోసం కృషి చేద్దాం...' అని రాహుల్ రామకృష్ణ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇటీవల హీరో విశ్వక్ సేన్‌కు, సదరు ఛానెల్ యాంకర్‌కు మధ్య లైవ్‌లోనే వాగ్వాదం జరగడం... అది పెద్ద సంచలనానికి దారితీయడం తెలిసిందే. ఈ విషయంలో విశ్వక్ సేన్‌కు మద్దతుగా నిలిచిన రాహుల్ రామకృష్ణ... తాజాగా మరోసారి ఆ టీవీ ఛానెల్‌కు చురకలంటించే ప్రయత్నం చేశాడు.


సినిమాల విషయానికొస్తే... నటుడిగా రెండో సినిమాతోనే రాహుల్ రామకృష్ణ తనదైన ముద్ర వేసిన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డిలో రాహుల్ పాత్ర ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయింది. ఆ సినిమాకు గాను బెస్ట్ కమెడియన్ అవార్డు కూడా రాహుల్‌కు దక్కింది. ఇటీవల 'ఆర్ఆర్ఆర్' సినిమాలోనూ రాహుల్ లచ్చు పాత్రలో మెరిశాడు. ఇప్పటివరకూ డజనుకు పైగా చిత్రాల్లో నటించిన రాహుల్ రామకృష్ణకు అర్జున్ రెడ్డితో పాటు గీత గోవిందం, హుషారు, వెబ్ సిరీస్ 'నెట్' తదితర చిత్రాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. రాహుల్ నటించిన 'కృష్ణ వ్రింద విహారి', 'విరాటపర్వం' సినిమాలు ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. 



[[{"fid":"230452","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]] 


Also Read: Happy Mothers Day 2022: నేడు మదర్స్ డే... మాతృమూర్తులకు 'గూగుల్ డూడుల్' స్పెషల్ విషెస్...


Also Read: ఏడుగురు సజీవ దహనమైన ఘటనలో షాకింగ్ విషయాలు... వెలుగులోకి 'ప్రేమ' కోణం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook