Raj Tarun: నేను `పురుషోత్తముడు`ని.. అందుకే బయటకు రాలేదు
Actor Raj Tarun Sensational Comments On Lavanya Allegations: తన ప్రియురాలు లావణ్య వ్యవహారంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువ నటుడు రాజ్ తరుణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు.
Raj Tarun Comments: సినీ పరిశ్రమలో యువ నటుడు రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారం తీవ్ర స్థాయిలో నడుస్తోంది. తనను ప్రేమించి మోసం చేశాడని.. అబార్షన్ కూడా చేశాడని.. వేరే హీరోయిన్‌తో వివాహేతర సంబంధం నడిపిస్తున్నాడని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో హీరో రాజ్ తరుణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన సినిమాకు సంబంధించి ప్రచార కార్యక్రమంలో రాజ్ తరుణ్ మాట్లాడారు. ఆ కార్యక్రమానికి ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Also Read: Raj Tarun: సినిమాల విషయంలో ఆశ్చర్యపరుస్తోన్న రాజ్ తరుణ్ నిర్ణయం.. ఏమన్నారంటే
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో తాను నటించిన 'తిరగబడరా సామి' అనే సినిమాకు సంబంధించి ప్రచార కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమా విషయం కన్నా రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. జర్నలిస్టులు లావణ్య విషయమై ప్రశ్నలు గుప్పించడంతో రాజ్ తరుణ్ చెప్పలేక చెప్పలేక సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ తాను పురుషోత్తముడిని అని చెప్పుకున్నారు.
Also Read: Raj Tarun: లావణ్యతో శేఖర్ బాషాకు ఉన్న లింకేంటి.. ? రాజ్ తరుణ్ ఎందుకు సైడ్ అయ్యాడు..
న్యాయ పోరాటం
'లావణ్య వ్యవహారంలో నేను న్యాయపరంగానే పోరాటం చేస్తాను. నేను లావణ్యకు వ్యతిరేకంగా వెళ్లడం లేదు. నేను ఆమె ఆరోపణలు చేసే వాటికి నేను న్యాయపరంగా వెళ్తున్నా. నేను ఇప్పటికే లీగల్ ఫైట్ చేస్తున్నా. ఆ విషయం బయటకు రాగానే నేనే అన్ని మీడియా చానెల్స్ ముందుకు వచ్చాను. నేను క్లారిటీ ఇచ్చాను. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. చట్టపరంగానే ముందుకు పోతాం' అని రాజ్ తరుణ్ ప్రకటించారు.
పెళ్లంటే భయం
'నాకు పెళ్లి అంటే చాలా భయం. జీవితంలో పెళ్లి గోల వద్దు అనుకున్న' అని మరోమారు రాజ్ తరుణ్ స్పష్టం చేశారు. 'నాతో పాటు శేఖర్ బాషా కూడా చాలా ఆధారాలు బయట పెట్టాడు. నేను పురుషోత్తముడు మూవీ కి ప్రమోషన్ కి రాకపోవడానికి కారణం ఉంది. నేను కూడా మనిషినే! నాపై కావాలనే నిందలు, ఆరోపణలు వచ్చాయి. దీంతో రాలేక పోయాను అంతే!' అని తెలిపారు. ఏదైనా కూడా నేను న్యాయ పోరాటం చేస్తున్నట్లు చెప్పారు.
ఎవరినైనా చెప్పమనండి
'నా 32 ఏళ్ల జీవితంలో వేలాది మంది తెలిసి ఉన్నారు. ఎవరైనా ఒక్కరు వచ్చి నా మీద చెడుగా చెప్పమని చెప్పండి' అని రాజ్ తరుణ్ సవాల్ విసిరారు. 'వారం.. పది రోజులుగా నేను ఇంట్లో కూర్చొని బాధపడుతున్నా. నేను చిన్న విషయానికి కూడా చాలా బాధపడుతుంటాను. నాతో పాటు నా తల్లిదండ్రుల కూడా చాలా బాధపడుతున్నారు' అని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదని మరోసారి రాజ్ తరుణ్ స్పష్టం చేశారు. 'నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను. నేను ఎక్కడ బయటపడి పారిపోలేదు. నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే నేను బయటకు రాలేదు. లావణ్య దగ్గర ఉన్న ఆధారాలు కంటే నాతో కూడా చాలా ఆధారాలు ఉన్నాయి' అని రాజ్ తరుణ్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter