Raj Tarun: సినిమాల విషయంలో ఆశ్చర్యపరుస్తోన్న రాజ్ తరుణ్ నిర్ణయం.. ఏమన్నారంటే

Raj Tarun Upcoming Movies: గత కొద్దిరోజులుగా రాజ్ తరుణ్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఒకపక్క వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ హీరో.. మరోపక్క అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లావణ్య వాళ్ళ.. ఎక్కువగా వార్తల్లో నిలవడం విశేషం. ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న తిరగబదరా.. స్వామి విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగుగా.. ఈ కార్యక్రమాల్లో రాజ్ తరుణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 31, 2024, 07:43 PM IST
Raj Tarun: సినిమాల విషయంలో ఆశ్చర్యపరుస్తోన్న రాజ్ తరుణ్ నిర్ణయం.. ఏమన్నారంటే

Raj Tarun Controversy: రాజ్ తరుణ్.. సినిమాలకన్నా ఎక్కువ ఈ మధ్య తన పర్సనల్ లైఫ్ వల్ల వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. లావణ్య రాజ్ తరుణ్ పైన పెట్టిన కేసుతో.. తరచూ వివాదాల్లో నిలుస్తూ వచ్చారు ఈ హీరో. అయితే వివాదాల వివాదాలే.. సినిమాలు సినిమాలే అన్నట్టు.. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే.. అంత ముందు కన్నా ఇప్పుడు రాజ్ తరుణ్ ఎక్కువగా సినిమాలు చేయడం. 

కాగా లావణ్య వివాదంతో బయటకి రాని రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రా.. రేపు తమ ఇద్దరూ నటించిన సినిమా తిరగబడరా సామీ విడుదల ఉండడంతో.. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు. ఈ క్రమంలో లావణ్య వివాదం పై స్పందించడంతో పాటు సినిమాల గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఈ హీరో. లావణ్య వివాదం గురించి చెప్పిన తరువాత రాజ్ తరుణ్ సినిమాల గురించి ఒక విలేకరుడు ప్రశ్నించగా.. దానికి ఆశ్చర్యకరమైన జవాబు ఇచ్చారు రాజ్ తరుణ్. 

రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ‘సినిమాలు సినిమాలే.. ఈ సంవత్సరం ముందుగా నాగార్జున గారి నా సామిరంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాను. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఇక మొన్న విడుదలైన పురుషోత్తముడు సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇక వెంటనే ఈ వారం విడుదల కాబోతున్న తిరగబడరా సామీ సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంతేకాదు మరో నెల రోజుల్లోనే మళ్ళీ ఇంకో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాను. నా నెక్స్ట్ సినిమా ‘భలే ఉన్నాడే’ నెల రోజుల్లో రాబోతోంది’ అని తెలిపారు.

రాజ్ తరుణ్ చెప్పింది బాగానే ఉంది కానీ.. విన్న ప్రేక్షకులకు మాత్రం ఆయన చెప్పిన మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఎందుకంటే రాజ్ తరుణ్ కి ఈమధ్య.. అసలు విజయాలు లేవు. రాజ్ తరుణ్ సినిమాలు కనీసం మినిమం బిజినెస్ కూడా చేయడం లేదు. ఇలాంటి క్రమంలో ఈ హీరో మంచి కథలు.. ఉన్న చిత్రాలు ఎంచుకొని.. సంవత్సరానికి ఒకటి చేసిన సరిపోతుంది. అలాకాకుండా ఇలా ఇష్టం వచ్చినట్టు కథలు ఒప్పుకొని సినిమాలు చేస్తే.. అది రాజ్ తరుణ్ కెరియర్ పై ఇంకా ఎక్కువ ప్రభావం పడొచ్చు అని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పర్సనల్ లైఫ్ పరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న ఈ హీరో.. ఇలా ఆలోచించకుండా సినిమాలు చేస్తే.. ప్రొఫెషనల్ కెరియర్ పరంగా కూడా సమస్యలు తప్పవు అనేది ఎంతోమంది సూచన. మరి రాజ్ తరుణ్ ఇప్పటికన్నా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారో లేదో చూడాలి.

Read more: Heart Attack: పాములకు గుండెపోటు వస్తుందా..?.. గిల గిల కొట్టుకుంటూ చనిపోయిన పాము.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News