'గరుడ వేగ' సినిమా ద్వారా చాలా రోజుల తర్వాత సక్సెస్ బాట పట్టారు హీరో డాక్టర్ రాజశేఖర్. అయితే సినిమా రిలీజ్ కు ముందు అమ్మ చనిపోవడం తననెంతో కృంగదీసిందని ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. సినిమా రిలీజ్, సక్సెస్ ట్రీట్, ప్రసంశలు ఆ బాధను మరిచిపోయేలా చేశాయని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ  ఇంటర్వ్యూ లోనే యాంకర్ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. తారా చౌదరి అఫైర్స్ గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు రాజశేఖర్- " నేను రాముడిని కాదు. నాకు పెళ్ళికి ముందు, జీవితతో పెళ్లైన తరువాత కూడా సంబంధాలు ఉన్నాయి. అయితే తారా చౌదరితో నాకు ఎటువంటి సంబంధము లేదు. ఆమె ఒకసారి నాతో ఫొటో దిగారు. ఆతరువాత ఎప్పుడో మరోసారి కలిసాము. అంతకు మించి నాకు, ఆమెకు మధ్య ఎటువంటి సంబంధము లేదు" అని అన్నారు. 


అలీ అలా చేయాల్సింది కాదు.. 


ఇదే ఇంటర్వ్యూ లో రాజశేఖర్ మాట్లాడ్తూ - "గబ్బర్ సింగ్" చిత్రంలోని అంత్యాక్షరి సన్నివేశంలో నన్ను ఇమిటేట్ చేస్తూ ఒక ఆర్టిస్ట్  చేసాడు. ఆ సన్నివేశంలో అలీ కూడా ఉన్నారు. అలీ నాకు క్లోజ్.. ఆ సీన్ వద్దనాల్సింది లేదా ఆ సీన్ నుంచి తప్పించమని అడగాల్సింది. కానీ, ఆ సీన్ చేశారు. అది నాకు బాధ‌నిపించింది. అలీని క‌లిసిన‌పుడు అడుగుదామ‌నుకున్నాను. కానీ, అయిపోయిన దాని గురించి ఇప్పుడెందుకని వదిలేశా` అని రాజ‌శేఖ‌ర్ చెప్పారు.