Sharwanand: యువ హీరో శర్వానంద్‌ తన పుట్టినరోజు నాడే డబుల్‌ ప్రమోషన్‌ పొందాడు. శర్వా తండ్రయ్యాడు. అతడి భార్య పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా హీరో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించాడు. పాప పుట్టిందని, తనకు పేరు కూడా పెట్టినట్లు వివరించాడు. ఈ సందర్భంగా భార్య, పాపతో కలిసి ఉన్న ఫొటోను శర్వా పంచుకున్నాడు. వారి ఫొటోను చూసిన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. దాంతోపాటు శర్వాకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Janhvi Kapoor: అందం.. అభినయంలోనూ శ్రీదేవికి తీసిపోని జాన్వీ కపూర్‌


ఈ సందర్భంగా పాప పేరును శర్వానంద్‌ తెలిపాడు. 'లీలా దేవి మైనేని' అని ప్రకటించాడు. గతేడాది శర్వానంద్‌ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు చెందిన న్యాయవాది పసునూరు మధుసూదన్‌ రెడ్డి కుమార్తె రక్షితా రెడ్డిని శర్వా 3 జూన్‌ 2023న జైపూర్‌లోనీ లీలా ప్యాలెస్‌లో వివాహమాడాడు. తమ అద్భుతమైన కలయికకు వేదికగా నిలిచిన లీలా ప్యాలెస్‌కు గుర్తుగా పాపకు 'లీలా దేవి' అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా భార్య రక్షిత పాపతో ఆడుకుంటున్న ఫొటోలను కూడా శర్వా పంచుకున్నాడు. ఇక శర్వా పుట్టినరోజు (మార్చి 6) సందర్భంగా సినీ నటీనటులు, దర్శకనిర్మాతలు ఇతర ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Also Read: Nivetha Pethuraj: లేలేత అందాలతో 'పాగల్‌'గాన్ని చేస్తూ 'ధమ్కీ' ఇస్తున్న హీరోయిన్‌


సినిమాల విషయానికి వస్తే శర్వానంద్‌ వరుస చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. అతడి పుట్టినరోజు సందర్భంగా కొన్ని సినిమాల ప్రకటనలు వెలువడ్డాయి. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై శర్వా తన 36వ సినిమా చేయనున్నాడు. వంశీ, ప్రమోద్‌ నిర్మాణంలో అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బైకర్‌గా శర్వా కనిపించనున్నట్లు పోస్టర్‌ ఆధారంగా చెప్పవచ్చు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ కూడా శర్వాతో చేస్తున్న సినిమాను ప్రకటించింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేసింది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న సినిమాకు 'మనమే' అని పేరు పెట్టారు. శర్వాకు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. 'సామజరవరగమన' దర్శకుడు రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో కూడా శర్వా తన 37వ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ విడుదల చేసింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి