Actor siddharth: ఆంధ్రప్రదేశ్​లో సినిమా టికెట్ ధరలపై తగ్గింపు వివాదం రోజు రోజుకు ముదురుతోంది. సినిమా ఇండస్ట్రీ వర్సెస్​ రాజకీయాల నాయకులు అనే స్థాయికి చేరుతున్నట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా సినిమా టికెట్ ధరల తగ్గింపు వివాదంపై నటుడు సిద్ధార్థ్​ స్పందించారు. సినిమా టికెట్​ ధరల తగ్గింపును సమర్ధిస్తూ స్పందించిన మంత్రులపై ఆగ్రహం వ్యక్తం (Actor siddharth on Cinema Ticket Prices) చేశారు. ఎవరి పేరును ఉద్దేశించకుండా.. మంత్రులందరిని విమర్శించారు సిద్ధార్థ్​. ఈ మేరకు ఓ ట్వీట్​ చేశారు.


అయితే ప్రస్తుతం ఏపీలో మాత్రమే ఈ వివాదం నడుస్తున్న నేపథ్యంలో.. సిద్ధార్థ్​ ఏపీ మంత్రులను ఉద్దేశించే ఈ విమర్శలు (Actor siddharth on AP ministers) చేసినట్లు తెలుస్తోంది.


ట్వీట్​లో ఏముందంటే..


'టికెట్ ధరల తగ్గించి కస్టమర్లకు (ప్రేక్షకులకు) డిస్కౌంట్​ ఇస్తున్నామని మాత్రులు మాట్లాడుతున్నారు. మేము పన్ను చెల్లింపుదారులం. మీరు అనుభవిస్తున్న లగ్జరీలన్నింటికీ మేము చెల్లింపులు చేస్తున్నాం. రాజకీయనాయకులు మాత్రం అక్రమంగా లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. కాబట్టి మీరు కూడా లగ్జరీలు తగ్గించుకుని.. మాకూ డిస్కౌంట్ ఇవ్వండి' అని సిద్ధార్థ్​ విమర్శనాత్మకంగా (Actor siddharth tweet on Cinema Ticket prices) స్పందించారు.



మరో ట్వీట్​లో.. క్రికెట్ స్టేడియాల పరిమాణం తగ్గించడం, క్రికెటర్ల వేతనాలు తగ్గించడం ద్వారా డిస్కౌంట్​ను కస్టమర్లకు ఎందుకు బదిలీ చేయడం లేదన్నారు. వినోదం ఏదైనా వినోదమేనన్నారు. అలాటప్పుడు తమ ఇండస్ట్రీపైనే ఎందుకు ద్వేషిస్తున్నారని ప్రశ్నించారు.



వివాదానికి అసలు కారణం ఇలా..


నటుడు నాని తన తాజా సినిమా 'శ్యామ్ సింగరాయ్​' ప్రమోషన్స్​లో భాగంగా ఇటీవల.. ఏపీలో సినిమా టికెట్ల ధరలు తగ్గించడంపై మాట్లాడారు. సినిమా టికెట్ల ధరలు తగ్గింపు నిర్ణయం (Actor Nani on Cinema Ticket prices in AP).. ప్రేక్షకులను అవమానించేలా ఉందన్నారు. ఈ వాఖ్యాలపై ఏపీ మంత్రులు వరుసగా నానిపై విమర్శలు చేస్తూ (AP Ministers on Actor Nani) స్పందించారు. దీనితో ఈ వివాదం రోజు రోజుకు ముదురుతున్నట్లు తెలుస్తోంది.


Also read: Trolls on Hero Nani: హీరో నానిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్.. సినిమా టికెట్లపై స్పందించడమే కారణమా?


Also read: Bigg Boss Telugu 6: ఓటీటీ వేదికగా తెలుగు బిగ్ బాస్... మళ్లీ నాగార్జునే హోస్ట్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook