Actor Simbu hospitalised due to viral infection: తమిళ హీరో శింబు వైరల్ ఇన్‌ఫెక్షన్‌(Viral infection)తో ఆస్రత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. శింబు తాజాగా నటిస్తున్న చిత్రం '‘వెందు తనిందదు కాడు'(Vendhu Thanindhathu Kaadu). ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్(Gautham Vasudev Menon) దర్శకుడు. కొన్ని వారాలుగా  ఈ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్న శింబుకు నిన్న తీవ్ర జ్వరం, గొంతులో ఇన్‌ఫెక్షన్‌ రావడంతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అయితే ఇది మామూలు ఇన్ఫెక్షనేనని, కొవిడ్ కాదని వైద్యులు తెలిపినట్టు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Sara Alikhan-Vijay Deverakonda: 'విజయ్ చాలా హాట్...అతనితో సినిమా చేయాలనుంది'..: సారా అలీఖాన్


ఇటీవలె శింబు నటించిన 'మానాడు'(Maanaadu) చిత్ర మంచి విజయం సాధించింది. అదే ఊపులో తన తదుపరి ప్రాజెక్టు  '‘వెందు తనిందదు కాడు'ను పట్టాలెక్కించించాడు శింబు(Actor Simbu) . ఈ సినిమా అఖరి షెడ్యూల్ ఇటీవల ప్రారంభమైంది. ఈ సినిమా టీజర్(Teaser)ను శుక్రవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇది ఒక్క రోజులో యూట్యూబ్‌లో 3.7 మిలియన్ల వ్యూస్ సాధించింది.  ఈశారి గణేష్ నిర్మించిన ఈ చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్(AR Rehman) సంగీతం అందిస్తున్నారు. ‘మన్మధ’, ‘వల్లభ’ వంటి చిత్రాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు శింబు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook