Sara Alikhan-Vijay Deverakonda: 'విజయ్ చాలా హాట్...అతనితో సినిమా చేయాలనుంది'..: సారా అలీఖాన్

Sara Alikhan: రౌడీహీరో విజయ్​దేవరకొండతో సినిమా చేయాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టింది బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 11, 2021, 04:11 PM IST
Sara Alikhan-Vijay Deverakonda: 'విజయ్ చాలా హాట్...అతనితో సినిమా చేయాలనుంది'..: సారా అలీఖాన్

Sara Alikhan-Vijay Devarakonda: బాలీవుడ్ భామ సారా అలీఖాన్..టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)పై సంచలన వ్యాఖ్యలు చేసింది. సారా తాజాగా నటించిన చిత్రం 'అత్రంగిరే'. ఈ సినిమా డిసెంబర్‌ 24న ఓటీటీలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా... సారా(Sara Ali Khan) ఇటీవల ఓ ఇంటరర్య్వూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమెను దక్షిణాదిలో ఏ హీరోతో చేయాలని ఉందని అడగ్గా... వెంటనే విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు విజ‌య్ చాలా హాట్‌గా ఉంటాడ‌ంటూ తన మన‌సులో మాట బ‌య‌ట‌పెట్టింది. 

Also Read: RRR : చెర్రీ, ఎన్టీఆర్‌లతో చాలా ప్రాబ్లమ్స్... జక్కన్న కంప్లైంట్‌కి ఊహించని ఝలక్...

విజయ్‌ ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌(Director Puri Jagannath) దర్శకత్వంలో 'లైగర్‌' సినిమా(Liger Movie)లో నటిస్తోన్నాడు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా నిర్వహించిన ఓ పార్టీలో విజయ్‌- సారాలు మొదటిసారి కలుసుకున్నారు. ఆ సమయంలో వారిద్దరూ కలిసి దిగిన సెల్ఫీని సారా తన ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది. అప్పుడు అది వైరల్​గా మారింది. ‘లైగర్‌’ సినిమాకు హిందీలో కరణ్‌జోహార్‌(Karan Johar) నిర్మాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News