Sudeep mother passed away: ప్రముఖ శాండిల్ వుడ్ హీరో కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.  తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన కన్నడ హీరో గానే కాకుండా తెలుగులో కూడా భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు.  ఇందులో సమంత, నాని జంటగా నటించిన విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇకపోతే కిచ్చా సుదీప్ ఒకవైపు కన్నడ, మరొకవైపు తెలుగు ఆడియన్స్ ను  ఆకట్టుకుంటూ విపరీతమైన క్రేజ్ ను  సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన ఇంట్లో విషాదఛాయలు అలముకున్నట్లు సమాచారం.  ఆయనకు మాతృవియోగం జరిగిందని.. తెలిసి అందరూ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సెలబ్రిటీలు అభిమానులు కోరుకుంటున్నారు. 


కిచ్చా సుదీప్ తల్లి.. సరోజా సంజీవ్ అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు..  సుదీప్ తల్లి సరోజా సంజీవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 7 గంటల ప్రాంతంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు నిర్ధారించారు. 


గత కొంతకాలంగా సరోజ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోంది.దీంతో ఆమె జయా నగర్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స ఫలించక ఆమె తుది శ్వాస విడిచినట్లు సమాచారం. 


సాధారణంగా కిచ్చా సుదీప్ కి తన తల్లి సరోజ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ముఖ్యంగా ఆమె గురించి ఎప్పుడూ స్టేజిపై ఆయన మాట్లాడుతూ ఉంటారు. అలాగే బిగ్ బాస్ వేదికపై కూడా వస్తది తన తల్లిని గుర్తు చేసుకున్న విషయం తెలిసిందే. అంతటి ఇష్టమైన తల్లి నేడు అతనికి దూరం కావడంతో దుఃఖ సంద్రంలో మునిగిపోయారు. ముఖ్యంగా కిచ్చా సుదీప్ ను ఓదార్చడానికి కుటుంబ సభ్యులు ఎంతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.


Also Read: Rythu Bharosa: రైతులకు బంపర్‌ గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. ఎకరాకు రూ. 7500 జమా..!  


Also Read: Renu Desai: డిప్యూటీ సీఎంను ఫాలో అవుతున్న రేణు దేశాయ్.. ఇంట్లో గణపతి, చండీ హోమం.. పిక్స్ వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.