Christmas tree tattoo: వేరే ఎక్కడైనా కన్పిస్తుందో లేదో గానీ..కులమతాలతో సంబంధం లేకుండా అన్ని పండుగల్ని కచ్చితంగా సెలెబ్రేట్ చేసేది సినీ ప్రముఖులే. అందుకే ఆ హీరో వేయించుకున్న పిక్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఆ ఫోటో విశేషమేంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తెలుగు, హిందీ, కన్నడ, తమిళం భాష ఏదైనా సరే..చిత్ర పరిశ్రమ మాత్రం అన్ని మతాల్ని జరుపుకుంటుంది. అందరూ కలిసి సెలెబ్రేట్ చేసుకుంటారు. ఇందులో భాగంగానే క్రిస్మస్ వేడుకల్ని( Christmas celebrations ) సరదాగా జరుపుకున్నరా టాలీవుడ్ హీరోలు. డిసెంబర్ 25న మేరీ క్రిస్మస్ ( Merry Christmas ) సందర్బంగా సినీ ప్రముఖులు చిరంజీవి, రామ్ చరణ్, మహేశ్ బాబు తదితరులు సెలెబ్రేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. కానీ ఓ హీరో షేర్ చేసిన పిక్ మాత్రం చాలా వైరల్ అవుతోంది. అందర్నీ ఆకట్టుకుంటోంది.


ఓ హీరో ఏకంగా తన వీపుపై క్రిస్మస్ ట్రీ టాటూ ( Christmas tree tattoo ) వేయించుకుని చూపిస్తూ పోజిచ్చాడు. ఆ ఫోటోని తన బావైన మహేశ్ బాబు ( Mahesh babu )కు పంపిస్తూ క్రిస్మస్ విషెస్ అందించాడు. అదే ఇప్పుడు పిక్ ఆఫ్ ది వైరల్‌గా మారినట్టుంది. టాలీవుడ్‌లో సిక్స్‌ప్యాక్‌లో  ఆకట్టుకునే హీరోల్లో సుధీర్ బాబు ( Sudhir babu ) ఒకడు. తన సిక్స్‌ప్యాక్‌‌ను చూపిస్తూనే..వీపుపై వేయించుకున్న క్రిస్మస్ ట్రీ టాటూ ప్రదర్శిస్తున్న ఫోటో ఇది. అందుకే చాలా వైరల్ అవుతోంది ఈ ఫోటో. 


నానితో కలిసి ఇటీవల సుధీర్ బాబు చేసిన సినిమా వి..అంచనాల్ని అందుకోలేదు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన వి సినిమా ( V movie ) ఫ్లాప్‌టాక్ మూటగట్టుకుంది. కానీ సుధీర్ బాబు క్రిస్మస్ ట్రీ టాటూ మాత్రం చాలా వైరల్‌గా మారింది. 


Also read: Alia Bhatt weds Ranbir kapoor: పెళ్లెప్పుడనేది ఖాయమైంది