Hero Suman : రాసి పెట్టి ఉండాలి!.. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడంపై హీరో సుమన్ కామెంట్స్
Actor Suman About Pawan Kalyan హీరో సుమన్ తాజాగా పవన్ కళ్యాణ్ మీద చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్, రాజకీయాల్లో ఉన్నత స్థానాన్ని చేరుకోవడం మీద చేసిన కామెంట్లు ఇప్పుడు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.
Pawan Kalyan To Be CM పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం మీద టాలీవుడ్ ప్రముఖులు ఒక్కో రకంగా మాట్లాడతారు. ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయ ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు కాకపోయినా ఇలానే గట్టిగా నిలబడితే.. సీఎంగా పవన్ కళ్యాణ్‌ను చూడొచ్చు అని అంతా అంటుంటారు. అయితే పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు హీరో సుమన్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిగా చెబుతున్నాను. ఆయనకు ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. ఏ ఏరియాకు వెళ్లినా కూడా ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఇది ఆయన అదృష్టం. రాజకీయమైనా, వ్యాపారమైనా కూడా ఆ దేవుడు రాసి పెట్టి ఉంచాలి.. మనం అంతా కూడా యాక్టర్లమే. ఆ దేవుడు మనకు కొన్ని రోజులు పాట కొన్ని పనులు అప్పగిస్తాడు. సీఎంగా ఆయనకు రాసి పెట్టి ఉంది.. ఒడిశాలో నవీన్ పట్నాయక్ కంటిన్యూగా ఐదుసార్లు సీఎంగా ఉన్నారు.. కంటిన్యూగా 25 ఏళ్లు ఆయనే ఉన్నారు..
ఎక్స్‌పైరీ టైం వచ్చినప్పుడు వెళ్లిపోతుంది. ఆయనకు ఇప్పుడున్న ఫాలోయింగ్ ఇంక ఎవ్వరికీ లేదు..ఎప్పుడు క్లిక్ అవుతారు.. ఆయనకు ఎప్పుడు ఆ స్థానం దక్కుతుంది.. ఆ సందర్భం ఎప్పుడు వస్తుంది.. క్యాస్ట్ ఈక్విషన్ సెట్ అవ్వాలి.. ఎప్పుడు చేయాలని జనాలు అనుకుంటారో.. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బ్యాలెన్స్ అవుతుంది.. ఈ మనిషి వస్తే వాళ్లంత ధైర్యంగా ఉంటారని ఎప్పుడు అనుకుంటారో అప్పుడు ఆయన అవుతారు.. ఓ నటుడిగా ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నాను అని అన్నాడు.
హీరో సుమన్‌కు మెగా ఫ్యామిలీకి మధ్య దూరం ఉంటుందని అంతా అనుకుంటారు. అలాంటి సుమన్ ఇప్పుడు ఇలా పవన్ కళ్యాణ్ మీద కామెంట్లు చేయడంతో అంతా ఆశ్చర్యపోతోన్నారు. ఇలా సుమన్‌లా ధైర్యంగా మైక్ ముందు పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ ఇచ్చేందుకు మిగతా టాలీవుడ్ ఆర్టిస్టులు ముందుకు రారన్న సంగతి తెలిసిందే.
Also Read: Rangamarthanda Movie Review : రంగ మార్తాండ రివ్యూ.. ఉండగలరా కన్నీరు కార్చకుండా?
Also Read: Das Ka Dhamki Movie Review : దాస్ కా ధమ్కీ రివ్యూ.. ప్లాన్ వేశాడు సీక్వెల్‌కి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook