'Das Ka Dhamki' Movie Review: దాస్ కా ధమ్కీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే.. ? సీక్వెల్‌ కూడా ప్లాన్ వేశాడు

Das Ka Dhamki Movie Review: విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ అంటూ నేడు థియేటర్లోకి వచ్చాడు. నిర్మాతగా, దర్శకుడిగా, హీరోగా ఈ సినిమాతో విశ్వక్ ప్రయోగం చేశాడు. ధమ్కీ సినిమా మీదే ఉన్నదంతా పెట్టేశాను అంటూ విశ్వక్ చెప్పిన మాటలు అందరికీ తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2023, 07:36 PM IST
  • నేడే థియేటర్లోకి దాస్ కా ధమ్కీ
  • మాస్‌ను మెప్పించేలా విశ్వక్ సేన్
  • సీక్వెల్‌కి ప్లానేసిన యంగ్ హీరో
'Das Ka Dhamki' Movie Review: దాస్ కా ధమ్కీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే.. ? సీక్వెల్‌ కూడా ప్లాన్ వేశాడు

Das Ka Dhamki Movie Review: విశ్వక్ సేన్ హీరోగా, దర్శకుడిగా తన సత్తాను ఇది వరకు చాటుకున్నాడు. ఫలక్‌నుమా దాస్ సినిమాతో డైరెక్టర్‌గానూ, హీరోగానూ మెప్పించాడు. ఆ సినిమాను నిర్మించి హిట్ కొట్టాడు. ఇప్పుడు దాస్ కా ధమ్కీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సారి కథనం, మాటలు, దర్శకత్వం, హీరో, నిర్మాత ఇలా అన్నింట్లోనూ విశ్వక్ సేన్‌ అదరగొట్టేశాడా? లేదా? అన్నది చూద్దాం.

కథ

కృష్ణ దాస్ (విశ్వక్ సేన్) పుట్టుకతోనే అనాధ. ఆది (హైపర్ ఆది), మహేష్‌ (రంగస్థలం మహేష్‌)లు కృష్ణ దాస్‌కు ప్రాణ స్నేహితులు. ఈ ముగ్గురూ స్టార్ హోటల్‌లో వెయిటర్‌లుగా పని చేస్తుంటారు. అలాంటి కృష్ణ దాస్ లైఫ్‌లోకి కీర్తి (నివేదా పేతురాజ్) వస్తుంది. ఆ తరువాత కృష్ణ దాస్ జీవితం ఎలా మలుపులు తిరిగింది. సంజయ్ రుద్ర (విశ్వక్ సేన్‌) లైఫ్‌లోకి కృష్ణ దాస్ ఎలా వచ్చాడు? అసలు సంజయ్ రుద్ర ఏం చేశాడు? ధనుంజయ్ (అజయ్) పాత్ర ఏంటి? సంజయ్ కృష్ణదాస్‌లు చివరకు ఏం అయ్యారు? వారిద్దరి మధ్య ఏం జరిగింది? అనేది కథ.

నటీనటులు

విశ్వక్ సేన్ నిజంగానే తన విశ్వరూపాన్ని చూపించాడు. కృష్ణ దాస్‌ వంటి పాత్రలు విశ్వక్ సేన్‌కు అలవాటైన పాత్రలే. కానీ సంజయ్ రుద్రగా విశ్వక్ సేన్ ఇంకో యాంగిల్‌ను చూపించాడు. ఎమోషనల్ సీన్స్, కామెడీ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఇలా అన్నింట్లోనూ విశ్వక్ అదరగొట్టేశాడు. ఇక నివేదా పేతురాజ్ పాత్ర సైతం మెప్పిస్తుంది. అందంగా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంటుంది. రావు రమేష్‌, అజయ్, రోహిణి, ఆది, మహేష్‌ ఇలా అందరూ కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

విశ్లేషణ

ధమ్కీ సినిమా చూస్తే కథ ఏమీ కొత్తగా అనిపించదు. మొన్నటికి మొన్న చూసిన ధమాకా ఛాయలు కనిపిస్తాయి. అయితే ఆ సినిమాకు కథ అందించింది.. ఈ సినిమాకు కథ అందించింది ఒకరే. ప్రసన్న కుమార్ అందించిన ఈ రెండు కథలకు చాలా దగ్గర పోలికలు కనిపిస్తాయి. అయితే ఆ కథలు కూడా ఇది వరకు మనం చూసినవే. అయితే ఈ కథలను ఎంత ఎంటర్టైనింగ్‌గా చూపించారు అనే దాని మీద సక్సెస్ రేటు ఆధారపడి ఉంటుంది. ధమాకా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ధమ్కీ ఫలితం మున్ముందు తేలనుంది.

ధమ్కీలో విశ్వక్ సేన్ మాత్రం కొత్తగా అనిపిస్తాడు. కనిపిస్తాడు. సెకండాఫ్‌లో విశ్వక్ సేన్ నటన సినిమాకు ప్లస్ అవుతుంది. ట్విస్టుల మీద ట్విస్టులు వస్తుంటాయి. అందులో కొన్నింటిని ప్రేక్షకుడు పసిగట్టేస్తాడు. క్లైమాక్స్ కూడా ఊహకందేలానే ఉంటుంది. అయితే సీక్వెల్‌కు మాత్రం గట్టి ప్లానే వేసినట్టు అనిపిస్తోంది. కొన్ని చోట్ల లాజిక్ లెస్ సీన్లు ఉన్నాయని అనిపిస్తాయి. కానీ అవేమీ పెద్దగా ఇబ్బంది కూడా అనిపించవు. సినిమా అన్నాకా ఆ మాత్రం లిబర్టీస్ తీసుకుంటారు. లాజిక్ రాహితంగా సీన్లను తెరకెక్కిస్తారు.

ప్రథమార్థం అంతా సరదాగా సాగుతూ ఉంటుంది. ఇంటర్వెల్‌కు కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. ద్వితీయార్థం ప్రారంభంలో ఇదేంటి మళ్లీ రొటీన్‌గా సాగుతోందని అంతా అనుకుంటారు. అలా అనుకున్న సమయంలోనే ట్విస్టులు మొదలవుతుంటాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అంతా కూడా చకచకా ముగుస్తుంది. ఇక సీక్వెల్ కోసం చేసుకున్న ప్లాన్‌, దాని కథ ఎలా ఉంటుందో చిన్నగా హింట్ ఇచ్చారు. ఈ సినిమాకు పాటలు, మాటలు కలిసి వచ్చాయి. కొన్ని చోట్ల ప్రాసలు చూస్తుంటే.. అవి విశ్వక్ సేనే రాశాడా? ప్రసన్న కుమార్ రాశాడా? అని అనుమానం కలుగుతుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఆర్ట్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ అన్నీ కూడా సక్రమంగా కుదిరాయి. 

రేటింగ్ : 2.5

బాటమ్ లైన్ : ధమ్కీ.. పర్లేదు ఒకసారి చూడటానికి!

Also Read:  Rangamarthanda Movie Review : రంగ మార్తాండ రివ్యూ.. ఉండగలరా కన్నీరు కార్చకుండా?

Also Read: Nani With Anchor Suma: ప్రోమోల కోసం నాని కూడా ఇలా చేస్తున్నాడా?.. అవాక్కైన యాంకర్ సుమ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News