Arulmani actor Died: కోలీవుడ్ చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు కమ్ రాజకీయ నాయకుడు అరుల్ మణి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు 65 యేళ్లు. గత పది రోజులుగా ఈయన అన్నాడీఎంకే (AIADMK) తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కోవలో గురువారం ఎండ తీవ్రత కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఫ్యామిలీ మెంబర్స్ వెంటకనే సమీపంలోని హాస్పటల్‌కు తరలించారు. అప్పటికే ఆయన ఆలస్యం కావడంతో ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు ధృవీకరించారు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈయన సింగం 2, లింగ, థెండ్రాల్ సహా దాదాపు 90 పైగా చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈయన నటుడిగా కొనసాగుతూనే రాజకీయాల్లో  కూడా ఉన్నాడు. అక్కడ అన్నాడీఎంకేకు వీరాభిమాని అయిన ఈయన ఆ పార్టీకి  ఎప్పటి నుంచో ప్రచారం  నిర్వహిస్తున్నారు.   ఈ కోవలో ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్ధుల తరుపున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కోవలో గురువారం అన్నాడీఎంకే అభ్యర్ధికి ప్రచారం చేస్తోన్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు ఆయన్ని హాస్పిటల్‌కు తరలించినా.. ప్రయోజనం లేకపోయింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.


Also Read: KT Rama Rao: కాంగ్రెస్‌ అభ్యర్థిపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. 'పనికి రాని చెత్త'గా అభివర్ణన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter