దిగ్గజ క్రికెటర్, శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ (Muthiah Muralitharan Biopic) ‘800’ నుంచి నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) వైదొలిగారు. తన బయోపిక్ విషయంలో వివాదం తలెత్తడంతో మాజీ క్రికెటర్ మురళీధరన్ విజ్ఞప్తి మేరకు విజయ్ సేతుపతి ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. విజయ్ సేతుపతి మంచి నటుడని, అయితే కేవలం తన సినిమా వల్ల కోలీవుడ్ నటుడికి ఏ ఇబ్బంది కలగకూడదని భావించి ఆయనను తప్పుకోవాలని కోరినట్లు మురళీధరన్ (Muthiah Muralitharan) తెలిపారు. ఈ మేరకు దిగ్గజ క్రికెటర్ మురళీధరన్ ఓ ప్రకటన విడుదల చేయడం తెలిసిందే. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమాపై త్వరలోనే అప్‌డేట్ ఇస్తానని, మూవీ నిర్మాత, దర్శకుడు మరో నటుడిని తన బయోపిక్ 800 మూవీ (Muthiah Muralitharan Biopic 800)కి ఎంపిక చేస్తారని క్రికెటర్ పేర్కొన్నాడు. సినిమా నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నాడని (Vijay Sethupathi quits from 800) మురళీధరన్ ప్రకటించిన అనంతరం నటుడు విజయ్ సేతుపతి సైతం అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా స్పిన్నర్ ముత్తయ్య ప్రకటనను షేర్ చేశారు. ‘ధన్యవాదాలు.. ఇక సెలవు’ అని ట్వీట్ చేశారు విజయ్ సేతుపతి.



 


‘విజయ్ సేతుపతి కెరీర్ నా సినిమా వల్ల ఇబ్బందుల్లో పడకూడదు. కొన్ని అనివార్య కారణాలతో నటుడు ఈ సినిమా నుంచి వైదొలగాల్సి వచ్చింది. విజయ్ సేతుపతిని 800 నుంచి తప్పుకోవాలని నేనే కోరాను. అందుకు ఆయన అంగీకరించారు. త్వరలో మరో నటుడిని సినిమాకు ఎంపిక చేస్తారని’ ముత్తయ్య మురళీధరన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.


 



 


వివాదం ఏంటి?
శ్రీలంక మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ప్రధాని మహింద రాజపక్సకు గతంలో శ్రీలంక తమిళుడు అయిన ముత్తయ్య మురళీధరన్ మద్దతు తెలిపారు. అయితే శ్రీలంకలో 3 దశాబ్దాలపాటు తమిళ టైగర్స్ అంతర్యుద్ధాన్ని అంతమొందించడంతో పాటు లక్షల మంది తమిళులను ఊచకోత కోశాడని రాజపక్సపై ఆరోపణలున్నాయి. తమిళులు ఆయన పేరు వింటేనే భగ్గుమంటారు. అలాంటి వ్యక్తికి మద్దతు తెలిపిన మురళీధరన్ బయోపిక్ ‘800’లో తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించడం తమిళులకు నచ్చలేదు. తీవ్ర వ్యతిరేకత రావడం, వివాదం రాజుకోవడంతో విజయ్ సేతుపతిని తన బయోపిక్ నుంచి తప్పుకోవాలని మురళీధరన్ కోరారు. అందుకు విజయ్ సేతుపతి అంగీకరించారు.  Gallery :  Bigg Boss 4: అరియానా గ్లోరి ఫొటోలు


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe