Vijay Sethupathi: తమిళ సూపర్‌స్టార్ విజయ్ సేతుపతిపై ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన దాడి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే దాడి ఎందుకు జరిగిందనే విషయంపై విజయ్ సేతుపతి తొలిసారిగా స్పందించాడు. దాడి గురించి అతనేమన్నాడంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు, తమిళంలో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న విజయ్ సేతుపతిపై(Vijay Sethupathi)ఇటీవల విమానాశ్రయంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి అటు తమిళనాడు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే దాడి గురించి రకరకాల ఉహాగానాలు తెరపైకొచ్చాయి. దాడి ఎందుకు జరిగిందనే విషయంపై స్పష్టత లేదు. బెంగుళూరు ఎయిర్‌పోర్టులో విమానం దిగి బయటకు వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై దాడి చేశాడు. వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి తన్నాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే ఆగంతకుడిని పట్టుకున్నారు. తనపై దాడి చేసిన వ్యక్తిని ఏమీ అనకుండా అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్లిపోయాడు విజయ్‌.


ఇప్పుడు తొలిసారిగా ఆ దాడిపై విజయ్ సేతుపతి స్పందించాడు. దాడి గురించి రేకెత్తుతున్న ఊహాగానాలకు తెరదించాడు. నిజానికి ఇది చిన్న ఘటన అని.. దాడి జరగడానికి ముందే ఆ వ్యక్తి  తన వ్యక్తిగత సిబ్బందితో గొడవపడ్డాడని విజయ్ సేతుపతి వివరించాడు. విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్(Attack on Vijay Sethupathi) అయ్యాక కూడా ఇది కొనసాగిందని.. ఆ సమయంలో అతనుతాగిన మైకంలో ఉన్నాడని.. అందుకే మతిస్థిమితం కొల్పోయి ఆ విధంగా ప్రవర్తించాడని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చాడు. వీడియోలు వైరల్‌ కావడంతో జనాలు దీన్ని పెద్ద సమస్యగా చేస్తున్నారని విచారం వ్యక్తం చేశాడు. అయినా ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫిల్మ్ మేక‌ర్ అయిపోతున్నారంటూ వ్యంగ్యంగా బదులిచ్చాడు. తనకు వ్యక్తిగత సిబ్బందిని నియమించుకోవడం ఇష్టం లేదని..ఎప్పుడూ తన స్నేహితుడితో కలిసి ప్రయాణిస్తానని చెప్పాడు. ఆ స్నేహితుడు తనకు 30 ఏళ్లుగా తెలుసని..చెప్పాడు. తన అభిమానుల్ని కలవడానికి, మాట్లాడటానికే ఇష్టపడతానన్నాడు. ఈ ఘటన జరిగినంత మాత్రాన తాను మారిపోనని..ఇప్పుడు కూడా అభిమానుల్ని కలుస్తూనే ఉంటానని విజయ్ సేతుపతి చెప్పాడు. 


Also read: Vicky Katrina Roka: పెళ్లికి సిద్ధమైన విక్కీకౌశల్ – కత్రినా.. దీపావళి రోజున జరిగిన రోకా ఫంక్షన్?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి