Vishwak Sen Instagram Account: ప్రపంచవ్యాప్తంగా మరోసారి మన తెలుగు సినిమా సత్తా చాటుతోంది. తెలంగాణ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన కల్కి ఏడీ దర్శకత్వం వహించి సంచలన హిట్‌ను అందుకున్నాడు. వెండి తెర మాయాజాలంగా పేర్కొంటున్న ఈ సినిమా హాలీవుడ్‌కు ఏమాత్రం తీసిపోదని పేర్కొంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన రివ్యూ అంశం ఓ హీరోను ఇరకాటంలో పెట్టేసింది. కల్కికి సంబంధించిన సినిమా రివ్యూను ముందే ఓ యూట్యూబర్‌ తన వీడియోల ద్వారా ఇస్తుండడంతో ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఈ పరిణామంతో ఆ హీరో తన సొంత ఇన్‌స్టాగ్రామ్‌ను డిలీట్‌ చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Tamanna Bhatia: పుస్తకాల్లో హీరోయిన్‌ జీవితం.. అందాలు ఆరబోసే తమన్నా మా పిల్లలకు ఆదర్శమా?


 


కల్కి సినిమాకు సంబంధించి ఓ యూట్యూబర్‌ రెండు వారాల కిందట కొంత రివ్యూ ఇచ్చాడు. ఇది చూసిన యువ హీరో మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడి పోస్టును తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టుకున్నారు. 'సినిమా విడుదల కాకముందే కొంత మంది చంబూ పట్టుకుని బయల్దేరారు. మీ సంపాదన కోసం వేలమంది ఆధారపడిన సినీ పరిశ్రమ అంటే మజాక్‌గా మారింది. ఇలాంటి వారు పైరసీ కన్నా ప్రమాదకరం' అని కామెంట్‌ చేశారు. ఈ వ్యవహారంతో యూట్యూబర్‌, హీరో మధ్య కొంత వివాదం నడించింది. ఇది జరిగిన తర్వాత విశ్వక్‌ సేన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ కనిపించడం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో మొన్నటిదాకా విశ్వక్‌ సేన్స్‌ (Vishwaksens) అనే పేరిట ఖాతా ఉండేది. ఆ ఖాతా ఇప్పుడు ఇన్‌స్టాలో కనిపించడం లేదు. ఆ పేరుతో వెతికితే 'ఈ పేజీ కనిపించడం లేదు' అని కనిపిస్తోంది.

Also Read: Kalki 2898 AD: అశ్వద్ధామ ఎవరు.. మహాభారతంలో అతని పాత్ర ఏంటి?


 


ఇదే క్రమంలో విశ్వక్‌ నటించిన 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' సినిమా విషయమై కూడా వివాదం నడించింది. ఈ వ్యవహారంపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. వరుసగా వివాదాలు చుట్టుముట్టిన సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌ను తట్టుకోలేక విశ్వక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌నే డిలీట్‌ చేశాడని తెలుస్తోంది. అందుకే ఇన్‌స్టాలో విశ్వక్‌ ఖాతా కనిపించడం లేదు. తమ అభిమాన హీరో ఇన్‌స్ట్రాగ్రామ్‌ కనిపించకపోవడంతో విశ్వక్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అకౌంట్‌ను మళ్లీ యాక్టివేట్‌ చేయాలనే డిమాండ్లు, విజ్ఞప్తులు వస్తున్నాయి.

కాగా విశ్వక్‌సేన్‌ను ట్రోల్‌ చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్రంగా సినీ పరిశ్రమలోకి వచ్చి నిలదొక్కుకున్న విశ్వక్‌పై ఎందుకు కక్ష సాధింపు అని మండిపడుతున్నారు. విశ్వక్‌ సినిమాలను కావాలనే దెబ్బతీసేలా ట్రోలింగ్‌ చేస్తున్నారని.. ఇప్పుడు వ్యక్తిగతంగా ట్రోల్‌ చేస్తున్నారని చెబుతున్నారు. వెంటనే ఇవి మానుకోవాలని విశ్వక్‌ అభిమానులు హెచ్చరిస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి