ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan), ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్ సోమవారం మధ్యాహ్నం  తమ నివాసానికి క్షేమంగా చేరుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న ఈ తల్లీకూతురు ముంబైలోని నానావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి కొన్ని రోజుల తర్వత తమ నివాసానికి వెళ్లారు. కోవిడ్19 రిపోర్టులు పరిశీలించిన నానావతి హాస్పిటల్ డాక్టర్లు సోమవారం మధ్యాహ్నం వీరిని డిశ్ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. Nithin Wedding Photos: హీరో నితిన్, షాలినిల పెళ్లి వేడుక ఫొటోలు 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండు వారాల కిందట బిగ్ బి అమితాబ్‌తో పాటు అభిషేక్ వచ్చన్, ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai), ఆరాధ్యలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. జులై 11న అమితాబ్, అభిషేక్‌లకు కరోనా పాజిటివ్‌గా తేలగా.. మరుసటి రోజు వచ్చిన కోవిడ్19 ఫలితాలలో జయాబచ్చన్‌కు నెగటివ్, ఐశ్వర్య, ఆరాధ్యలకు పాజిటివ్‌గా నిర్ధారించారు.



కొన్ని రోజులు ఇంట్లో హోం క్వారంటైన్‌లో ఉన్న ఐష్, ఆరాధ్యలకు లక్షణాలు ఎక్కువు అవుతున్న నేపథ్యంలో వారం కిందట అదే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. బికినీలో టైటిల్ నెగ్గిన నటి హాట్ హాట్‌గా..   
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్