Actress Aishwarya: ఒకప్పుడు స్టార్ హీరోల సరసన హీరోయిన్.. ఇప్పుడు సబ్బులు అమ్ముకుంటోంది..
Actress Aishwarya Selling Soaps: సినీ ఇండస్ట్రీ అనగానే భారీ రెమ్యునరేషన్లు.. లగ్జరీ లైఫ్ గుర్తొస్తాయి.. అయితే ఇది అందరు నటీనటులకు వర్తించకపోవచ్చు. సుదీర్ఘ కాలం సినిమాల్లో కొనసాగాక కూడా చివరకు ఏమీ సంపాదించుకోలేని నటీనటులు చాలామందే ఉంటారు.
Actress Aishwarya Selling Soaps: ఒకప్పుడు ఆమె స్టార్ స్టేటస్ ఉన్న నటి.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ.. ఇలా సౌత్ ఇండస్ట్రీలో దాదాపు 100 చిత్రాల్లో నటించింది.. మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్ సరసన హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించింది. ఇంత నేపథ్యం ఉన్న ఆ నటి ప్రస్తుతం ఏం చేస్తుందో తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక పొట్ట కూటి కోసం ఆమె సబ్బులు అమ్ముతోంది. వీధుల్లో ఇంటింటికి తిరిగి సబ్బులు అమ్మగా వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తోంది. ఇంతకీ ఆ నటి ఎవరంటే.. ఐశ్వర్య భాస్కరన్.
ప్రముఖ నటి లక్ష్మి కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఐశ్వర్య భాస్కరన్ తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నారు. 1989లో వచ్చిన 'అడవిలో అభిమన్యుడు' సినిమాతో ఆమె తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వరుసపెట్టి సినిమాలు చేశారు. ఈ క్రమంలో మోహన్ లాల్ లాంటి స్టార్స్ సరసన వరుస సినిమాలు చేశారు. కెరీర్‌లో దాదాపు 100 వరకు సినిమాలు చేసినా ఆర్థికంగా మాత్రం నిలదొక్కుకోలేదు. ఇదే విషయాన్ని ఇటీవల ఓ తమిళ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐశ్వర్య వెల్లడించారు.
'ప్రస్తుతం నాకు పని లేదు. డబ్బు లేదు. అలాగనీ అప్పులేమీ లేవు. వీధుల్లో సబ్బులు అమ్ముతూ బతుకుతున్నాను. ఉన్న ఒక్క కూతురు పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ఇప్పుడు నా ఫ్యామిలీలో నేనొక్కదానినే ఉన్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పనిచేయడానికైనా నేను సంకోచించను. రేపు మీ ఆఫీసులో జాబ్ ఇస్తానంటే తప్పకుండా వచ్చి చేస్తా. అవసరమైతే టాయిలెట్స్ కూడా క్లీన్ చేస్తా.' అని ఐశ్వర్య తన పరిస్థితిని వివరించారు.
'సినిమాల్లో సంపాదించిన డబ్బును నేనేమీ తాగడానికి ఖర్చు చేయలేదు. లేదా నాకోసం ఖర్చు పెట్టుకోలేదు. అంతా ఫ్యామిలీ కోసమే ఖర్చు చేశాను. నేను నటించడం ప్రారంభించిన మూడేళ్ల పాటు కెరీర్ బాగా సాగింది.. ఇంతలోనే పెళ్లయింది. ఆ తర్వాత క్రమంగా నేను సినీ ఇండస్ట్రీకి దూరమవాల్సి వచ్చింది. హీరోయిన్‌గా అందరి సెకండ్ ఇన్నింగ్స్ నయనతారలా ఉండదు. ప్రస్తుతం నేను ఇండిపెండెంట్‌గా ఉన్నాను. యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తూ సబ్బులు అమ్ముతున్నాను. నేను ఇండిపెండెంట్‌గా ఉన్నందుకు నా కూతురు చాలా గర్వపడుతుంది.' అని ఐశ్వర్య చెప్పుకొచ్చారు. ఐశ్వర్య ఇలాంటి పరిస్థితుల్లో ఉందని తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు షాక్... పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
Also Read: Virataparvam Review: రానా, సాయిపల్లవిల 'విరాటపర్వం' రివ్యూ అండ్ రేటింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.