ఇప్పుడంతా వెబ్ సిరీస్ ట్రెండ్ ( Web series ) నడుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ ( OTT platform ) లన్నీ వెబ్ సిిరీస్ లతో నిండుతున్నాయి. ప్రేక్షకులు కూడా వెబ్ సిరీస్ పై ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే స్టార్స్ అంతా డిజిటల్ కు పయనమవుతున్నారు. ఇప్పుడీమె కూడా అటే అడుగేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నెట్ ఫ్లిక్స్ ( Netflix )..అమెజాన్ ( Amazon prime )..జీ5 ( Zee5 )..హాట్ స్టార్ ( Hotstar ) ఇలా ఓటీటీ ప్లాట్ ఫారమ్ లు వెబ్ సిరీస్ లలో బిజీగా ఉంటున్నాయి. ఒకదానకొకటి పోటీగా ప్రేక్షకుల్ని రంజింపచేసే పనిలో పడ్డాయి. విభిన్నమైన వెబ్ సిరీస్ లు ప్లాన్ చేస్తున్నాయి. మొన్నటివరకూ వెబ్ సిరీస్ లో పెద్దగా ప్రాముఖ్యత లేని నటీనటులు కన్పిస్తుండేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. స్టార్స్ సైతం వెబ్ సిరీస్ ( Web series ) వైపు ఆసక్తి చూపిస్తున్నారు. నటిస్తున్నారు. తెలుగు , తమిళ చిత్రాల్లో మంచి నటిగా పేరు సంపాదించుకున్న అమలాపాల్ ( Amala paul ) కూడా అటే చూస్తున్నారు. అది కూడా ఒక బోల్డ్ వెబ్ సిరీస్ ( Bold web series ) లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల అమలాపాల్  నటించిన  ఆమె వివాదాస్పదమై విడుదలైంది. ప్రముఖ దర్శకుడు మహేశ్ భట్ ( Director Mahesh Bhatt ), జియో స్టూడియోస్ ( jio studios ) ఈ వెబ్ సిరీస్ ను హిందీలో నిర్మిస్తున్నారు. తమిళనాట ప్రముక నవల  ఆధారంగా...1970 నేపధ్యంలో ఈ వెబ్ సరీస్ ఉంటుందని తెలుస్తోంది. Also read: RGV లెస్బియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘డేంజరస్’