హైదరాబాద్: బుల్లితెర మీద సందడి చేసే యాంకర్లలో అనసూయ భరద్వాజ్ ఒకరు. నటిగానూ రాణిస్తూ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందుతోంది అనసూయ. అందం, అల్లరి, తెలివి, నటన వీటన్నీటి కలబోతే జబర్దస్త్ అనసూయ. టీవీ షోలతో బిజీగా ఉంటూనే సినిమాల్లో విలక్షణ పాత్రలకు ఓకే అంటోంది ఈ రంగమ్మత్త. బన్నీ లేటెస్ట్ మూవీలో కీలకపాత్రలో ‘రంగమ్మత్త’ అనసూయ కనిపించనున్నారు. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. రంగమ్మత్తకు సుకుమార్ మరోసారి అవకాశం ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అధికారికంగా వివరాలు తెలియాల్సి ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

See PICS: అనసూయ ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత హీరోహీరోయిన్లుగా వచ్చి సక్సెస్ సాధించిన సినిమా రంగస్థలం. ఆ సినిమాను తెరకెక్కించింది సుకుమార్. అందులో అనసూయకు రంగమ్మత్త పాత్ర ఇచ్చి సినిమాలో కీ రోల్ పోషించేలా చేశారు. కాగా రంగమ్మత్త పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో తన లేటెస్ట్ సినిమాలో సుకుమార్ మరోసారి అవకాశం ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. అల వైకుంఠపురం తర్వాత దర్శకుడు సుకుమార్‌తో కలిసి పనిచేయబోతున్నారు బన్నీ. గతంలో ఆర్య, ఆర్య 2 సినిమాలతో వీరి కాంబినేషన్‌లో హిట్ సినిమాలొచ్చాయి. 


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..